S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/22/2019 - 23:40

కరీంనగర్, అక్టోబర్ 22: పొరుగు రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రంలోకి ధాన్యం తరలి రాకుండా జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ‘చెక్’ పోస్టులు సమర్థవంతంగా పనిచేయాలని, తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

10/22/2019 - 12:55

హైదరాబాద్: ఏపీలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

10/22/2019 - 05:46

గుంటూరు: దేశ, సమాజ శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, విధుల పట్ల అంకితభావంతో పనిచేసే పోలీసులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలీసు అమరవీరుల దినోత్సవం నాడు ఓ చారిత్రాత్మక ఒప్పందానికి పోలీసుశాఖ శ్రీకారం

10/22/2019 - 05:16

సికిందరాబాద్: డెంగ్యూ వ్యాధి బారిన పడి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ జడ్జి మృతి చెందారు. ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎం.జయమ్మ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం ఇటీవలే మినిష్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరడంతో డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్థారించారు.

10/22/2019 - 01:19

హైదరాబాద్, అక్టోబర్ 21: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితినే విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వివిధ సంస్థలు ప్రకటించాయి. పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా టీఆర్‌ఎస్‌యే గెలవబోతోందని ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు విశ్వసనీయ సమాచారం.

10/21/2019 - 07:38

హైదరాబాద్, ఆక్టోబర్ 20: సమాజంలో దాడులను తట్టుకొని హిందుత్వం నిలబడిందని, అయితే హిందూ ధర్మాన్ని అంతం చేయడం ఎవరితరం కాదని వీహెచ్‌పీ అఖిల భారత మఠ మందిర్ ప్రముఖ్ అరవింద్ బ్రహ్మభట్ అన్నారు. కాచిగూడలోని శ్యాంమందిర్ సమావేశ గదిలో తెలంగాణ ప్రాంత మఠ మందిర్ ప్రముఖ్‌ల సమావేశం నిర్వహించారు.

10/22/2019 - 06:01

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్టీసీ నష్టాలకు ముఖ్యమంత్రి కారణమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కేసీఆర్ నిర్ణయాల వల్ల గత 15 రోజులుగా తెలంగాణ తీవ్ర నష్టానికి గురవుతోందని అన్నారు. ఈ నష్టాలను కేసీఆర్ పూడుస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ సీఎంగా చరిత్రకెక్కారని అన్నారు.

10/21/2019 - 05:26

హైదరాబాద్, అక్టోబర్ 20: ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దోచిపెడుతున్నారని కాంగ్రెస్ నేత డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని విమర్శించిన కేసీఆరే ఇప్పుడు వారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని విమర్శించారు.

10/21/2019 - 05:07

గంగాధర నెల్లూరు, అక్టోబర్ 20: చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సుమారు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. ఆదివారం ఉదయం కలెక్టర్ తన స్నేహితులతో కలిసి చిత్తూరు నుంచి పల్లిపట్టు, బలిజకండ్రిగ, పాలసముద్రం, గంగాధరనెల్లూరు మీదుగా వంద కిలోమీటర్లు సైకిల్ సవారీ చేసి చిత్తూరు నగరానికి చేరుకున్నారు.

10/21/2019 - 05:03

విశాఖపట్నం, అక్టోబర్ 20: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పర్యావరణ కాలుష్యం నుంచి విముక్తి పొందేలా పర్యావరణ హిత ఇంధన వినియోగంపై పరిశోధనలు జరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

Pages