S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/16/2019 - 05:48

కర్నూలు, ఆగస్టు 15: శ్రీశైలం జలాశయానికి తుంగభద్ర నది ద్వారా వస్తున్న వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో కృష్ణానది వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి గురువారం రాత్రి 7,27,321 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం నుంచి 6,77,689 క్యూసెక్కులు, తుంగభద్ర నది నుంచి సుంకేసుల బ్యారేజ్ ద్వారా 49,632 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుతోంది.

08/16/2019 - 04:58

హైదరాబాద్, ఆగస్టు 15: అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా నడిచినపుడే స్వాతంత్య్రం వచ్చినట్టు అని ఆనాడు గాంధీజీ చెప్పారని, కానీ ప్రస్తుత సమాజంలో పగలు కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి దాపురించిందని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎన్ జ్యోతి , ప్రధానకార్యదర్శి పుస్తేల సృజన పేర్కొన్నారు.

08/16/2019 - 04:56

విజయవాడ, ఆగస్టు 15: రాష్ట్ర రాజధాని అమరావతిని, సచివాలయ ఆవరణను ప్రస్తుత ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని కీలక భవనాలకు, రహదారులకు మూడు రంగుల కాంతిని వెదజల్లే విద్యుత్ దీపాలతో అందంగా అలకరణ చేశారు.

08/16/2019 - 04:56

చిత్రం...ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు రాఖీ కడుతున్న సోదరి వైఎస్ షర్మిల

08/16/2019 - 05:47

మఠంపల్లి, ఆగస్టు 15: భక్తుల కోరిన కోరికలు తీర్చే మట్టపల్లి నర్సింహ్మా స్వామికి పులిచింతల ముప్పు వచ్చింది. నిత్యం స్వామి నామస్మరణతో మారుమోగే ఆలయంలో కరకట్ట లీకేజీల ద్వారా వరద నీరు వస్తుండూంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

08/16/2019 - 05:36

హైదరాబాద్, ఆగస్టు 15: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టారు. ప్రగతి భవన్‌కు వచ్చిన సీఎం సోదరీమణులు ఆయనకు సంప్రదాయబద్ధంగా రాఖీలు కట్టి స్వీట్ తినిపించి ఆశీర్వదించారు.

08/16/2019 - 02:24

హైదరాబాద్ : వచ్చే నెల, సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవం రోజున కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీ మజ్లిస్‌కు మోకరిల్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

08/16/2019 - 02:22

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి బేసిన్‌తో పాటు చెరువులు కూడా కళకళలాడుతున్నాయి. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు రెండోవారం వరకు కురిసిన భారీ వర్షాలతో చెరువులు నిండకుండలా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 43,764 చెరువులు ఉన్నాయి. వీటి మొత్తం నీటి నిల్వసామర్థ్యం 256 టీఎంసీలు. తాజాగా కురిసిన వర్షాల వల్ల 3,589 చెరువుల్లో నీరు పొంగిపొరుతున్నది.

08/16/2019 - 01:31

హైదరాబాద్, ఆగస్టు 15: ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలిగించని విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించారు. భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కోండ కోట వద్ద గురువారం జరిగిన రాష్టస్థ్రాయి వేడుకలో దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. గోల్కొండ కోట రాణిమహల్ లాన్స్‌లో ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.

08/16/2019 - 01:25

హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్ గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగురవేసిన జాతీయ పతాకం సగమే ముడివీడింది. గురువారం ఉదయం 10 గంటలకు గోల్కొండ కోట రాణిమహల్ లాన్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద జాతీయ పతాకం కర్రను ఏర్పాటు చేశారు. కేసీఆర్ వేదికపైకి రాగానే తొలుత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

Pages