S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/16/2019 - 23:12

శ్రీశైలం టౌన్, ఆగస్టు 16: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 6,60,333 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 89,996 క్యూసెక్కులు కలిపి మొత్తం 7,50,329 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరింది. ఇదే సమయానికి డ్యాం నీటిమట్టం 881.60 అడుగులుగా నమోదుకాగా 196.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

08/16/2019 - 22:55

హైదరాబాద్, ఆగస్టు 16: దేశ ఆర్థిక రాజధాని ముంబయని ఇంకా భారీ వర్షాలు వీడడంలేదు. దీంతో ముంబయ వెళ్ళే రైళ్లు సోలాపూర్ వరకు నడిపిస్తన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవల భారీ వర్షాలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులు చేపడుతున్నందున ముంబయ - సోలాపూర్ మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.

08/16/2019 - 22:55

హైదరాబాద్, ఆగస్టు 16: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఈయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం గడువు ముగిసిన తర్వాత వాటి పరిశీలన పూర్తి అయింది.

08/16/2019 - 22:39

న్యూఢిల్లీ, ఆగస్టు 16: తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వక పోవడంపై ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు వెంటనే స్పందించాలని కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావుడిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో వీహెచ్ విలేఖరుతో మాట్లాడుతూ కేంద్రంలో యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో యూనివర్సిటీ విద్యార్థులకు రాజీవ్ ఫెలోషిఫ్ ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుతం ఈ పెలోషిప్ ఇవ్వడం లేదన ఆరోపించారు.

08/16/2019 - 22:36

సంధ్యావేళ సాగర్ అందాలు

08/16/2019 - 22:28

* నిలిచిపోయిన చికిత్సలు
* మంత్రి ఈటల చర్చలు విఫలం
* ఇవ్వాల్సింది రూ. 600 కోట్లు: ప్రభుత్వం
* కాదు 1200 కోట్లు: నెట్ వర్క్ ఆస్పత్రులు

08/16/2019 - 22:27

* నామినేటెడ్ పదవుల భర్తీకి కేసీఆర్ శ్రీకారం
* రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్
* కేబినెట్ మంత్రి హోదా
* బడ్జెట్ ప్రతిపాదనల బాధ్యత అప్పగింత
* వారంలో రోజుల్లో రాష్టస్థ్రాయి పోస్టుల భర్తీ

08/16/2019 - 22:13

మంత్రాలయం, ఆగస్టు 16: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 348వ సప్త ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం పూర్వారాధన వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలబృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. రకరకాల పుష్పాలతో బృందావనాన్ని అందంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు బృందావనాన్ని దర్శించుకుని పూజలు చేశారు.

08/16/2019 - 05:57

తిరుపతి: శ్రావణ పున్నమి సందర్భంగా తిరుమలలో స్వామివారికి ఘనంగా స్వర్ణ గరుడ సేవ జరిగింది. గురువారం సాయంత్రం 7గంటలకు స్వర్ణ గరుడవాహనంపై స్వర్ణ్భారణ అలంకృతుడైన శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు

08/16/2019 - 05:02

గుంటూరు: జాతీయ సమగ్రతకు యువత నడుం బిగించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయజెండాను పవన్ ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజలను ఏకం చేసేవి రెండే పండుగలని, ఒకటి ఆగస్టు 15, మరొకటి గణతంత్ర దినోత్సవమన్నారు.

Pages