రాష్ట్రీయం

ఉగ్ర నారసింహునికి భక్తజన నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 10: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో సనాతన సంప్రదాయరీతిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా మంగళవారం జరిగిన శ్రీ ఉగ్రనారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలలో భాగస్వాములయ్యేందుకు అశేష భక్తజనం క్షేత్రానికి తరలివచ్చారు. ఉదయాతూర్వం దేవాలయాలను తెరవగా, సంప్రోక్షణం అనంతరం దేవస్థానం వంశపారంపర్య యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, వేదపండితులు రమేశ శర్మ మార్గదర్శకత్వంలో అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నేరేళ్ళ శ్రీనివాసాచార్య, హరినాథాచార్య, రమణాచార్య, కిరణ్, విజయ్, అరుణ్, సంతోష్ తదితరులు ఆలయాలలో, దేవస్థానం ఏసీ, ఈఓ శ్రీనివాస్ పర్యవేక్షణల ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య అర్చనలు, నిత్య కల్యాణంతో పాటు పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నృసూక్త, లక్ష్మీసూక్త, విష్ణుసూక్త, మన్యుసూక్త, సుదర్శన, విశ్వక్సేన, తిరుకళ్యాణ మహోత్సవ వ్యాహ్య కర్మణి ఆవాహిత సర్వదేవతాహ్వానం, గరుడ, ఆళ్వారుల హవనం, లోక కళ్యాణార్థం వ్యాహృతి హోమాది ప్రత్యేక క్రతువులను నిర్వహించారు. మంగళవారం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు, యాత్రికులు పరమ పవిత్ర గోదావరినదిలో మంగళ స్నానాలు ఆచరించి, సుప్రభాత దర్శనానికి వివిధ ఆలయాల ముందు బారులు తీరి నిలుచున్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు కోడెమొక్కులు, వల్లుబండ, గండాదీపాది మొక్కులు తీర్చుకున్నారు. సహస్ర స్వర్ణ కమలార్చనలో పాల్గొన్నారు. సంతానార్థం హోమగుండంవద్ద ప్రత్యేక పూజలు చేయించుకుని భగవదాశీస్సులనొందారు. ప్రధానంగా ఉగ్ర నారసింహాలయంలో చాలామంది భక్తులకు పూనకం రావడం, తమ భవిష్యత్తును, మంచిచెడులను భక్తులు అడిగి తెలుసుకోవడం కనిపించింది. కాగా శ్రీయోగానంద నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా ఆలయానికి గణనీయ ఆదాయం సమకూరింది. మొత్తం నాలుగు రోజులకు ఈ ఏడు 24,62,915 రూపాయలు టికెట్ల ద్వారా, ప్రసాదాల విక్రయాల ద్వారా, అన్నదానం ద్వారా అదనపు ఆదాయం లభించినట్టు ఏసీ, ఈఓ శ్రీనివాస్ వివరించారు. ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయాత్వూర్వంనుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు.
*చిత్రం...అలంకృత లక్ష్మీ సమేత ఉగ్ర నారసింహుడు