S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/18/2019 - 01:21

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీలో కోలాహలం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అనేక కారణాల వల్ల చురుకుగా వ్యవహరించకపోవడం వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టింది. దీనికి తోడు వరుసగా రెండోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ సీట్లలో గెలవడంతో రాష్ట్ర బీజేపీలో జోష్ పెరిగింది.

08/18/2019 - 01:19

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ దర్పణ్’లో తెలంగాణకు చెందిన ఆరు జిల్లాలు జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచాయని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ప్రకటించింది.

08/18/2019 - 01:19

హైదరాబాద్, ఆగస్టు 17: ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వానికి-నెట్‌వర్క్ ఆసుపత్రుల మధ్య ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ఆరోగ్యశ్రీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చల తర్వాత శనివారం ఎలాంటి పురోగతి కనిపించలేదు.

08/18/2019 - 01:17

నల్లగొండ, ఆగస్టు 17: ప్రపంచం అబ్బురపడే రీతిలో అద్భుత శిల్పకళతో నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా ఆలయం స్వయంభూ దర్శనాలను భక్తులకు కల్పించేందుకు వీలుగా మూడు నెలల్లో ప్రధానాలయం పనులు పూర్తి చేయాలని, ఫిబ్రవరిలో శ్రీ మహాసుదర్శన నారసింహ సహాస్ర కుండాత్మక యాగం నిర్వహించనున్నందున, అప్పటిలోగా ఆలయం అభివృద్ధికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

08/18/2019 - 01:05

అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్లకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, కాంట్రాక్టర్లకు దొడ్దిదారిన దోచిపెట్టిందని ఆరోపిస్తూ ప్రస్తుతం పనిచేస్తున్న నవయుగ సంస్థ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. గత కొద్ది రోజులుగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు కసరత్తు జరిపింది.

08/18/2019 - 01:04

గుంటూరు: కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తక్షణం నివాసాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి నోటీసులు జారీచేశారు.

08/18/2019 - 01:02

అమరావతి, ఆగస్టు 17: కృష్ణానదీ పరివాహక లంక గ్రామాలు ఏర్లను తలపిస్తున్నాయి.. వరదనీరు చుట్టుముట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. గత మూడు రోజులుగా వ్యవసాయ, ఉద్యానవన పంటలు నీట నానుతున్నాయి. శనివారం మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 7లక్షల 78వేల 223 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, సాయంత్రానికి వరద ప్రవాహం కొంచెం తగ్గు ముఖం పట్టింది.

08/18/2019 - 00:59

అమరావతి, ఆగస్టు 17: నవ్యాంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులు, అనుమతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి అవినీతి, బంధుప్రీతి అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని స్పష్టం చేశారు.

08/17/2019 - 00:15

విజయవాడ, ఆగస్టు 16: కృష్ణానదికి మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణాజిల్లాలో నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, లంకలు విలవిల లాడుతున్నాయి. 24 గ్రామాలు వరద తాకిడికి గురి కాగా 12 గ్రామాలు జలదిగ్బంధానికి గురై బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

08/17/2019 - 00:12

అమరావతి, ఆగస్టు 16: కృష్ణానది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం హై టెన్షన్ నెలకొంది. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తడంతో కరకట్ట దిగువ భాగాన ఉండవల్లి వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్స్‌లోకి కూడ వరద నీరు చొచ్చుకొస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు నివాసం పరిసరాల్లో రెండు డ్రోన్లు చెక్కర్లు కొట్టాయి.

Pages