S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/14/2019 - 01:20

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల టికెట్ల కేటాయింపులో సీనియర్ నేత కొప్పు ల రాజుకు ప్రమేయం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా చెప్పారు. ఈ విషయ మై పార్టీ నేతలు లేనిపోని అపోహలు పెట్టుకోరాదని ఆయన కోరారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకే టికెట్లను కేటాయించారన్నారు.

08/14/2019 - 01:17

శ్రీశైలం ప్రాజెక్టు, ఆగస్టు 13: కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయం నిలకడగా ఉంది. జూరాల డ్యాం గేట్ల ద్వారా 7,33,020 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం ద్వారా 1,93,612 క్యూసెక్కులు మొత్తం 9,26,632 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లో వచ్చి చేరుతోంది.

08/14/2019 - 01:15

హైదరాబాద్ : జిల్లా ప్రజాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులకు (సీఈఓ) నిధులు డ్రా చేయడంతో పాటు, ఖర్చు చేసే అధికారం కల్పించిన వారం రోజులకే ఈ అధికారాలను ప్రభుత్వం మళ్లీ తొలగించింది. నిధులు డ్రా చేసే అధికారాన్ని సీఈఓలకు కట్టబెడుతూ ఈ నెల 6న ఒక జీఓ (జీఓ ఆర్‌టీ నెంబర్ 470) జారీ అయింది. పంచాయతీరాజ్ కార్యదర్శి వికాస్ రాజ్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

08/14/2019 - 01:10

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బుధవారం రాత్రివరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.

08/14/2019 - 01:10

హైదరాబాద్, ఆగస్టు 13: కేవలం నెలంటే నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి రంగం పూర్తిగా నిరాశా వాతావరణం నుంచి ఆశాజనకమైన పరిస్థితుల్లోకి అడుగుపెట్టింది. వరుణ దేవుడి కటావీక్షణాల వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు 20 రోజుల వ్యవధిలో నిండిపొర్లుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆనంద వాతావరణం నెలకొంది. నెల రోజుల వ్యవధిలోనే ఇరు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ ముఖచిత్రం మారింది.

08/14/2019 - 00:56

అమరావతి : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇకపై హెల్త్‌కార్డ్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య, ఆరోగ్యశాఖపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూఆర్ కోడ్‌తో హెల్త్‌కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఆరోగ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు.

08/14/2019 - 05:48

విజయవాడ : రెండు నెలల క్రితం పార్టీ ఓటమి పాలయ్యాక బాధపడ్డానని, రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన వచ్చిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంక్షోభాలను ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదన్నారు. తాను ఓటమిని అంగీకరించబోనని, భవిష్యత్తు టీడీపీదేనని పునరుద్ఘాటించారు. 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ మనది అన్నారు.

08/14/2019 - 00:52

విజయవాడ, ఆగస్టు 13: అరాచకాలు సృష్టిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీలు చేయాలంటే కుదరదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి స్పష్టం చేశారు. గోదావరి జలాలను తెలంగాణకు తరలింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎందుకీ అహంభావం, ఏమిటీ అరాచకం అంటూ ధ్వజమెత్తారు.

08/14/2019 - 00:47

అమరావతి, ఆగస్టు 13: ఇసుక పర్మిట్లను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు తీసుకువచ్చి డంప్ యార్డ్‌ల్లోనే పర్మిట్లు మంజూరు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ‘స్పందన’ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

08/14/2019 - 00:41

విజయవాడ, ఆగస్టు 13: పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం 70 గేట్లను మూడు అడుగుల మేర పైకి ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలుతున్నారు.

Pages