రాష్ట్రీయం

స్మార్ట్ విద్యుత్ మీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విద్యుత్ వినియోగదారుల నుంచి ఇక నిర్ణీత కాల వ్యవధిలోనే నయాపైసాతో సహా బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ సరికొత్త సంస్కరణలను ప్రవేశపెట్టబోతున్నది. ఇందులో భాగంగా దశల వారీగా ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చాలని యోచిస్తున్నది. నిర్ణీత కాల వ్యవధిలో బిల్లు చెల్లించని పక్షంలో తక్షణమే ఆ కనెక్షన్‌కు ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ కొత్త విధానాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు పరిచేందుకు
కేంద్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పలు రాష్ట్రాలతో సమాలోచనలు సాగిస్తున్నారు. జాతీయ కార్యక్రమం కింద తొలుత దేశ వ్యాప్తంగా పది లక్షల స్మార్ట్ మీటర్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే యుపీ, ఢిల్లీ, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ మీటర్లు అమల్లోకి వచ్చాయి. సకాలంలో విద్యుత్ బిల్లు కట్టకపోతే ఆటోమేటిక్‌గా కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. ఎప్పుడైతే బిల్లు కడతారో మళ్లీ కరెంట్ వస్తుంది. ఇందుకోసం ఏ లైన్‌మెన్ సహాయం అవసరం లేదు. మొబైల్ మాదిరిగానే పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సదుపాయాలు ఉంటాయి. ఎవరు ఎంత రీచార్జి చేసుకుంటే అన్ని ఎక్కువ రోజులు విద్యుత్ అందుతుంది. అవసరం లేకపోతే మీటర్ కూడా స్విచ్ ఆఫ్ చేయవచ్చు. నిర్ణీత చార్జి ప్రకారం ఒకే మొత్తంలో లేదా వాయిదాల్లో చెల్లింపు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యుత్ చౌర్యం, లోడ్ వ్యవస్థ, బిల్ ఫిల్లింగ్ మొదలైన వాటి నుంచి బయటపడతారు. అన్నింటినీ మించి ఏ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎంత విద్యుత్ సరఫరా, ఏ మేర రాబడి వస్తుంది ఇట్టే తెలుస్తుంది.