రాష్ట్రీయం

తెలుగువారి జీవితంలో కథలు కరువవుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నల్లకుంట, మార్చి 1: కథకు వస్తువు దొరకనంతగా తెలుగువారి జీవితం సంక్లిష్టమైపొయిందని ప్రముఖ సినీ, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తీ అన్నారు. సంతానానికి పేర్లు పెట్టడం దగ్గర నుంచి మనుషుల మధ్య బంధాల వరకు వాతవరణం అంత కృతకంగా మారిపొయిందని పేర్కొన్నారు. జాతీయ తెలుగు దిన పత్రిక (జాగృతి) ఆధ్వర్యంలో నిర్వహించిన కథల, నవల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ రామిరెడ్డి దూరవిద్య విభాగ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరివెనె్నల సీతారామ శాస్ర్తీ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. పురణాలన్ని కథల సమాహారాలేనని అన్నారు. ఒక్క అంగ్ల పదం కూడా లేకుండా చక్కని తెలుగులో వెలువడిన చందమామా వంటి పుస్తక ప్రచురణ నిలిచిపొవడం తెలుగు కథకు పెద్ద కుదుపు అని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తెలుగు నవల పరిపూర్ణత సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు రచన ఒక్కటే పరిపూర్ణ నవల అని చెప్పారు. సమాజంలో నానాటికి విలువలు పడిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెండ్ సింహాద్రి సత్యనారాయణ మాట్లాడుతూ మన దేహమే సమాజానికి ప్రతిబింబమని ఇందులో ఏఒక్క భాగం నిరాదరణకు గురైన ఫలితాలు వేరేగా ఉంటాయని అన్నారు. తెలుగు కథ, నవల చరిత్ర గురించి జాగృతి సంపాదకుడు డా.గోపరాజు నారాయణ రావు పరిచయం చేసిన కార్యక్రమంలో జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య సీ.సంజీవ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ రావు, జాగృతి ట్రస్ట్ కార్యదర్శి సి.రాఘవేంద్ర, వాకాటి పాండురంగా రావుపాల్గొన్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్ర్తీని సత్కరిస్తున్న అతిథులు