రాష్ట్రీయం

తిరుమలకు మరింత భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను 3,309.89 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని చైర్మన్ ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఆయన విలేఖరులకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-20 సంవత్సరానికి గానూ రూ.3,243 కోట్లు, 2020-21కు గానూ రూ.3,309.89 కోట్లు బడ్జెట్‌ను నేటి సమావేశంలో ఆమోదించామన్నారు. ఇందులో
శ్రీ శార్వరీ నామ సంవత్సర తెలుగు పంచాంగం శనివారం నుండి తిరుమల, తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు. మార్చి మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీటీడీ కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. తిరుమలలోని బూందీ పోటులో అగ్నిప్రమాదాలు నివారణ కోసం రూ. 3.30 కోట్లతో ఆధునాతన థర్మోఫ్లూయిడ్ కడాయిలు ఏర్పాటుకు ఆమోదించినట్లు తెలిపారు. జూపార్క్ సమీపంలో రూ. 14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ హాస్టల్ భవనం, రూ. 34 కోట్లతో ఎస్వీ బదిర పాఠశాల హాస్టల్ భవనాల నిర్మాణానికి ధర్మకర్తల మండలి నిధులు కేటాయించిందన్నారు. అలిపిరి-చెర్లోపల్లి రోడ్డు విస్తరణలో మిగిలివున్న పనులను రూ. 16 కోట్లతో పూర్తి చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. బర్డ్ ఆస్పత్రిలో వివిధ కేటగిరీల్లో అవసరమైన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించామన్నారు. అలాగే రూ.8.43కోట్లు బర్డ్ ఆసుపత్రిలో నూతన ఓపీ భవనం, అదనపు ఆపరేషన్ థియేటర్‌కోసం నిధులు కేటాయింపుజరిగిందన్నారు. తిరుమలలో భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా మూడు దశల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో ఉన్న 1300 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించి టెండరు ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 20 కోట్లు మంజూరు చేశామన్నారు. చెన్నయ్‌లోని జిఎన్ చెట్టి రోడ్డులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి కృష్ణా జిల్లాకు చెందిన నటరాజన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు రూ. 3.92 కోట్లతో టెండరు ద్వారా అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ. 4 కోట్లతో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి ప్రారంభం జరిగిందన్నారు. ఆ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, పుష్కరణి, వాహన మండపం, కల్యాణోత్సవ మండపం తదితర నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. టీటీడీ నిఘా, భద్రతా విభాగంలో ఖాళీగా ఉన్న 300 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేయాలని, అలిపిరి చెక్‌పాయింట్ వద్ద టోల్‌గేట్‌లో జాతీయ రహదారుల సంస్థ నిర్దేశించిన మేరకు వాహనాల విభజన చేపట్టి ఫాస్టాగ్ అమలు చేయాలని, టోలు రుసుం పెంచాలని నిర్ణయించామన్నారు. ద్విచక్ర వాహనాలకు టోలు రుసుము మినహాయించినట్లు చెప్పారు. ఇన్ఫోసిస్ సంస్థ సహకారంతో టీటీడీలో సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేకాధికారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూ, వారణాశి, ముంబైలలో త్వరలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. అయితే స్థలానికి సంబంధించి తమ అధికారులు వెళ్లి పరిశీలించి వస్తున్నారన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తామన్నారు. వీఐపీలకు పగటి పూట దర్శన సౌకర్యం కల్పించామని లెజిస్టేచర్ కమిటీ చేసిన సూచనలపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు తిరుమల అదనపు ఈ ఓ ధర్మారెడ్డికి అప్పగించామన్నారు. గరుడవారధికి సంబంధించి నిధులు కేటాయిస్తామని, అయితే టీటీడీ ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని చెప్పామన్నారు. తమ ఇంజనీరింగ్ అధికారులు వారితో చర్చిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదనపు ఈ ఓ ఏ.వి.్ధర్మారెడ్డి, జే ఈ ఓ పి.బసంత్ కుమార్, సీవీ ఎస్వో గోపీనాథ జెట్టి ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

*చిత్రం...తిరుమల అన్నమయ్య భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్
వై వీ సుబ్బారెడ్డి ఈఓ సింఘాల్ తదితరులు