S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/23/2020 - 06:10

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసిన మట్టి డంపింగ్ కారణంగా కాలుష్య ముప్పు ఏర్పడిందని వచ్చిన ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సభ్యులు సి పాల్ పాండే, ఎం మధుసూదన్ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. మట్టి డంపింగ్ కారణంగా కాలుష్యం ముప్పు వస్తోందని ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదు మేరకు వారు పర్యటించారు.

01/23/2020 - 05:04

హైదరాబాద్, జనవరి 22: మున్సిపల్ శాఖ పరిధిలోని నోటిఫికేషన్ 20/2018 ద్వారా హెల్త్ అసిస్టెంట్ పోస్టుల ఎంపికకు ప్రాధమిక జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది. 2018 డిసెంబర్ 13న నిర్వహించిన లిఖిత పరీక్ష ఆధారంగా ఈ ప్రాధమిక జాబితా రూపొందించినట్టు కమిషన్ పేర్కొంది. మొత్తం 50 పోస్టులకు 32 మంది ఎంపికయ్యారని, మిగిలిన పోస్టులకు అర్హులు లేరని పేర్కొంది.

01/23/2020 - 01:48

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ పిరమాల్ గ్రూప్ రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని రూ.500 కోట్ల వ్యయంతో విస్తరించనున్న ట్టు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి

01/22/2020 - 06:16

గుంటూరు: రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులపై లాఠీఛార్జి చేయించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన పార్టీ నిద్రపోదని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఆడపడుచులు, అన్నదాతలు, దివ్యాంగుల ఒంటిపై పడిన దెబ్బలే వైసీపీ సర్వనాశనానికి దారితీస్తాయని మండిపడ్డారు.

01/22/2020 - 06:03

విజయవాడ, జనవరి 21: రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వ విధానాలకు, రెండు బిల్లులకు వ్యతిరేకంగా రూల్ 71 కింద టీడీపీ ఇచ్చిన నోటీసు నెగ్గింది. చర్చకు ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నోటీసు నెగ్గడంతో బుధవారం వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

01/22/2020 - 05:59

నెల్లూరు: జీవితంలో సమయపాలన, క్రమశిక్షణ ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందచేశారు.

01/22/2020 - 05:52

తిరుపతి, జనవరి 21: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ ఇచ్చే పథకాన్ని ధర్మకర్తల మండలి ఆమోదం పొందిన అనంతరం సోమవారం 51,621 మంది భక్తులకు ఉచితంగా లడ్డూలు అందించామని టీటీడీ అదనపు ఈ ఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ భక్తులకు ఉచిత లడ్డూ అందించే పథకాన్ని సోమవారం నుంచీ అమలు చేస్తున్నామన్నారు.

01/22/2020 - 02:05

హైదరాబాద్: ఓట్లు వేసేందుకు వచ్చే ఓటర్లను గుర్తించేందుకు తొలిసారి ‘పైలట్’ ప్రాతిపదికన మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని 10 కేంద్రాల్లో డిజిటల్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా గుర్తింపు కేంద్రాలను దేశంలోనే ఇది ప్రథమమని తెలుస్తోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తమ వెంట ఓటర్ గుర్తింపు కార్డును కానీ ఇతర గుర్తింపు కార్డులను కానీ తీసుకురావలసి ఉంటుంది.

01/22/2020 - 01:28

రథసప్తమి రోజున వాహన సేవల వివరాలు
సూర్యప్రభ వాహనం : ఉదయం 5.30 నుండి 8గంటల వరకు
చిన్నశేషవాహనం : ఉదయం 9 నుండి 10గంటల వరకు
గరుడవాహనం : ఉదయం 11 నుండి 12గంటల వరకు
హనుమంత వాహనం : మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2గంటల వరకు
చక్రస్నానం : మధ్యాహ్నం 2 నుండి 3గంటల వరకు
కల్పవృక్షవాహనం : సాయంత్రం 4 నుండి 5గంటల వరకు
సర్వభూపాల వాహనం : సాయంత్రం 6 నుండి 7గంటల వరకు

01/22/2020 - 01:53

విజయవాడ: అధికార, ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య శాసన మండలిలో ఎట్టకేలకు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టగలిగింది. బిల్లులను ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం.. వ్యూహ, ప్రతి వ్యూహాలతో వాడివేడిగా మండలి సమావేశం సాగింది. మండలిలో భారీగా మంత్రులు మోహరించారు. శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుకు మంత్రి బుగ్గన ప్రయత్నించడాన్ని రూల్ 71 కింద నోటీసు ద్వారా టీడీపీ అడ్డుకుంది.

Pages