రాష్ట్రీయం

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఊడిపోయిన బోగీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఫిబ్రవరి 24: కాచిగూడ నుంచి చిత్తూరుకు వెళుతున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు ఊడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు భయాందోళనలకు గురైన సంఘటన సోమవారం ఉదయం తిరుపతి సమీపంలోని మామండూరు రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకివెళితే ఆదివారం రాత్రి కాచిగూడ నుంచి 24 బోగీలు, 2 డీజిల్ ఇంజన్‌లతో బయల్దేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం ఉదయం 9 గంటలకు చిత్తూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు సోమవారం ఉదయం 7.30 గంటలకు రేణిగుంట మండల పరిధిలోని మామండూరు రైల్వేస్టేషన్ వద్ద రైలు ఎస్-11, ఎస్-12 బోగీలకు ఉన్న కప్లింగ్ ఊడిపోవడంతో రైలు దాదాపు 200మీటర్ల వరకు బోగీలు విడిపోయి ప్రయాణించింది. దీనిని గమనించిన మామండూరు రైల్వేస్టేషన్ మాస్టర్, స్టేషన్‌లోని రైల్వే సిబ్బంది ముందు వెళుతున్న రైలు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో రైలును అప్పటికప్పుడే ఆపేశారు. జరిగిన విషయాన్ని మామండూరు రైల్వేస్టేషన్ మాస్టర్ రేణిగుంటలోని రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. మామండూరులో ఉన్న రైల్వేసిబ్బంది పాయింట్స్‌మెన్ సహకారంతో బోగీలు విడిపోయి ముందువెళ్లిన సగభాగం రైలును తిరిగి వెనక్కు తెచ్చి యథాస్థితిలో పెట్టి రైలు బోగీ కప్లింగ్‌ను పరిశీలించి ఊడిపోయిన కప్లింగ్‌లను సరిచేయడంతో తిరిగి ఉదయం 8.25 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి రేణిగుంట రైల్వేస్టేషన్‌లో టెక్నికల్ సిబ్బంది కప్లింగ్ ఊడిపోయిన బోగీలను క్షుణ్ణంగా పరిశీలించి ఉదయం 9 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్ నుంచి చిత్తూరుకు బయల్దేరి వెళ్లింది. మొత్తం మీద ఒకటిన్నర గంటసేపు ఆలస్యంగా గమ్యస్థానానికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు చేరుకుంది.