రాష్ట్రీయం

ఘనంగా గురు వైభవ మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఫిబ్రవరి 25: మంత్రాలయంలో గురువైభవ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. శ్రీ రాఘవేంద్రస్వామి 399వ పట్ట్భాషేక మహోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి బంగారు పాదులకు మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు.
అనంతరం పాదుకలను స్వర్ణరథంపై ఉంచి ఊరేగించారు. తొలుత స్వామివారి మూల బృందావనానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగీంద్ర కళామండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఉత్సవాల్లో భాగంగా పలువురు కళాకారులు, ప్రముఖులను పీఠాధిపతి సన్మానించారు.
*చిత్రం... శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనం