S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/14/2019 - 05:46

తిరుపతి, అక్టోబర్ 13: పెరటాసి మాసం కావడం, విద్యార్థులకు దసరా సెలవులు ముగుస్తుండటం, వారాంతపు సెలవులు కూడా కలసి రావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. దీంతో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. ఎటుచూసినా క్యూలైన్లలో పిల్లాపాపలతో వేచి ఉన్న భక్తులే దర్శనమిస్తున్నారు.

,
10/13/2019 - 23:39

భద్రాచలం టౌన్, అక్టోబర్ 13: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శబరి స్మృతియాత్ర వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో కోలాటాలు.. రేలా నృత్యాలతో గిరిజనులు రాములోరి చెంత ఉత్సవం జరిపారు. అపర భక్తురాలైన శబరి వంశస్తులుగా.. సంప్రదాయబద్ధంగా తీరొక్క పూలు, పండ్లు సమర్పించి భక్తితో కొలిచారు. కొండాకోనల నుంచి పిల్లాపాపలతో కదిలొచ్చి..

10/13/2019 - 23:35

ఖమ్మం, అక్టోబర్ 13: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో 5 రోజుల పాటు జరగనున్న చతుర్వేద స్వాహాకార పురస్పర రుద్ర హవన సహిత సహస్ర చండీ యాగం ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

10/13/2019 - 23:24

ఖమ్మం, అక్టోబర్ 13: ఆర్టీసీ కార్మికుల సమ్మె డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతితో మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం ఆర్టీసీ డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆదివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఆర్టీసీ కార్మికులతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీనితో ఖమ్మం ఉద్రిక్తంగా మారింది.

10/13/2019 - 07:25

తిరుపతి : వరుస సెలవుదినాల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తుల రద్దీ శనివారం గణనీయంగా పెరిగింది. ఉచిత క్యూలైన్‌లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.2.86 కోట్లు ఆదాయం లభించినట్లు శనివారం మధ్యాహ్నం పరకామణిలో లెక్కలు కట్టారు.

10/13/2019 - 06:45

సబ్బవరం, అక్టోబర్ 12: అంతరిక్షంలో ప్రపంచంలోని అనేక దేశాలు చేసే పరిశోధనలు,ప్రయోగాలు ప్రపంచ శాంతికి దోహదపడాలే గానీ వినాశనానికి కాకూడదని అంతరిక్షంలో ఆయుధాలు, అణుశక్తివ్యతిరేక ప్రపంచ సమగ్రాభివృద్ధి సంస్థ కార్యదర్శి బ్రూస్ గగ్నోన్ (్ఫ్లరిడా) అన్నారు.

10/13/2019 - 06:09

హైదరాబాద్, అక్టోబర్ 12: ఈఎస్‌ఏ ఆసుపత్రి మందుల కుంభకోణం వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. డైరెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి కోట్ల రూపాయల విలువ చేసే కుంభకోణంలో ప్రధాన పాత్రధారి కాగా, పలువురు కిందిస్థాయి ఉద్యోగులు కూడా ఈ పాపంలో పాలుపంచుకున్నారు. మందుల కొనుగోలులో నకిలీ బిల్లులు సృష్టించి కోట్లు దండుకున్నారు ఈ కేసుకు సంబంధించిన నిందితులు.

10/13/2019 - 06:08

హైదరాబాద్, అక్టోబర్ 12: గంగా నది ప్రక్షాళన పోరాటానికి బాసటగా నిలుస్తానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. హరిద్వార్ పర్యటనలో ఉన్న పవన్ అక్కడ సదన్ ఆశ్రమంలో జరిగిన జీడీ అగర్వాల్ సంస్మరణ సభలో మాట్లాడారు. ప్రకృతిని పరిరక్షించాలని తపన పడే జీడీ అగర్వాల్ ఎంతో మహానీయుడని ఆయనను కోల్పోవడం జాతి దురదృష్టమని చెప్పారు.

10/12/2019 - 00:11

అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పన, సమర్థ నిర్వహణకై ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలన్నారు.

10/11/2019 - 23:35

హైదరాబాద్, అక్టోబర్ 11: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే 162 ప్రత్యేక రైళ్లును నడిపినట్లు రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 10 వరకు 352 అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పది రోజుల్లో దాదాపు 2 లక్షల మందిని గమ్యం స్థానానికి చేర్చామని మన్నారు. వీటిలో 98 రిజర్లేషన్ రైళ్లు, 64 జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు నడిపినట్లు చెప్పారు.

Pages