రాష్ట్రీయం

పశు సంవర్థక సహాయక పోస్టుల భర్తీకి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థలో 6,858 పశుసంవర్థక సహాయకుల పోస్టుల భర్తీకి సత్వర చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. నిర్దేశించిన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే పశు సంవర్థక సహాయకుని పోస్టునకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. పశు సంవర్థక శాఖ సహాయకుని పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్ణీత ధ్రువపత్రాలను గ్రామ సచివాలయ వెబ్‌సైట్‌లో ఈ నెల 3 నుండి 10వ తేదీ వరకు ఆప్‌లోడ్ చేయాలని పశు సంవర్థక శాఖ సంచాలకుడు డాక్టర్ ఎం శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ తిరుపతి నిర్వహించిన రెండు సంవత్సరాల పశుసంవర్థక పాలిటెక్నిక్ కోర్సు, డెయిరీ అండ్ పౌల్ట్రీ సైనె్సస్ ఒక సబ్జెక్టుగా కలిగి ఒకేషనల్ కోర్స్ చేసిన వారు, 2 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లమో కోర్స్ చేసిన వారు తదితరులు లేదా పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ రెండు సంవత్సరాల ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్స్ ఉత్తీరుణలయిన వారు అర్హులు.