S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/11/2019 - 05:31

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కేఆర్. ఆమోస్ తీవ్ర అనారోగ్యంతో మల్కాజిగిరిలోని తన నివాసంలో మృతి చెందారు. టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అమోస్ 1969లో ఉద్యమ సమయంలో సర్వీస్ నుంచి డిస్మిస్ ఆయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్సీగా పనిచేసిన అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరా రు.

10/11/2019 - 01:38

హైదరాబాద్, అక్టోబర్ 10: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇప్పటికే పంజాబ్, హర్యానాల నుండి ఇవి పూర్తిగా నిష్క్రమించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. అలాగే చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నైరుతిరుతుపవనాలు నిష్క్రమించాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా ఉపసంహరణకు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించారు.

10/11/2019 - 00:51

హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగాల నియామాల కోసం పోటీపడి ఉద్యోగాలకు ఎంపికైన తెలంగాణ యువకులకు అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి ఒక లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై సీరియస్‌గా చర్చించాలని సూచించారు. తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలన్నారు.

10/11/2019 - 00:12

హైదరాబాద్, అక్టోబర్ 10: కృష్ణా జలాల నుంచి రబీ సాగుకు తెలంగాణకు 79 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 150 టీఎంసీల నీటిని కేటాయించాల్సిందిగా కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఇరు రాష్ట్రాలు ఇండెంట్ పెట్టాయి. దీనిపై అధికారిక ఉత్తర్వులు శుక్రవారం విడుదల చేయనున్నట్టు బోర్డు వెల్లడించింది. జల సౌధలో గురువారం సమావేశమైంది.

10/10/2019 - 12:48

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా ఉంది. దీంతో ఆరు క్రస్ట్‌గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.7462 టీఎంసీల నీరు ఉంది.

10/10/2019 - 06:53

తిరుపతి : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సెప్టెంబర్ 30న ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం నాడు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి.

10/10/2019 - 02:29

కశింకోట, అక్టోబర్ 9: విశాఖ జిల్లా కశింకోట మండలం నర్శింగబిల్లి-పరవాడపాలెం సమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. దీంతో స్థానికులు, రైల్వే అధికారులు గుర్తించి రైళ్ళను దారి మళ్లించారు. విశాఖపట్నం-విజయవాడ వెళ్లే మార్గంలో పట్టా విరిగిపోవడంతో అధికారులు వెంటనే స్పందించి రైళ్ల రాకపోకలను నియంత్రించారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టారు.

10/10/2019 - 00:42

*చిత్రం...తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాడు ఆలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తున్న వేదపండితులు

10/09/2019 - 22:17

గద్వాల, అక్టోబర్ 9: రైతు శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రైతు శ్రేయస్సు కొరకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం రైతులకు పాడిపరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఆవులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు.

10/09/2019 - 22:14

నాగార్జునసాగర్, ఆక్టోబర్ 9: నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్ధాయి నీటిమట్టం 5980 అడుగులు దాటిపోవడంతో బుధవారం నాడు 4 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి పూర్తి స్ధాయి నీటిమట్టానికి సాగర్ చేరుకోవడంతో రాత్రి నుండి 2 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తూ బుధవారం మధ్యాహ్నాం వరకు కూడా కొనసాగించారు. బుధవారం మధ్యాహ్నాం నుండి 4గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు.

Pages