రాష్ట్రీయం

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్వేశ్వరరావు(నాని) తెలిపారు. త్వరలోనే జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం అనంతరం ఎదురౌతున్న సమస్యలుపైన, మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు, గతంలో జేఏసీతో చేసుకున్న ఒప్పందాలు అన్ని అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జేఏసీ నేతల బృందం బుధవారం సచివాలయంలో రవాణా మంత్రి పేర్ని నానితో ఆయన ఛాంబర్‌లో కలిసి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వివరించారు. అతిముఖ్యమైన 27 డిమాండ్లుతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి జేఏసీ నేతలు అందించారు. ఇందులో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఓల్డు పెన్షన్ స్కీమ్ అమలయ్యేలా చూడాలన్నారు. జీతభత్యాలలో ఉన్న వ్యత్యసాలను సరిచేయాలన్నారు. గతంలో జేఏసీతో చేసుకున్న ఒప్పందం మేరకు 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలన్నారు. భార్యాభర్తలకు ఇస్తామన్న ఫ్రీట్రావెలింగ్ కార్డులను వెంటనే ఇవ్వాలన్నారు. లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ ఇవ్వాలన్నారు. పెండింగులోని కారుణ్యనియామకాలు, మెడికల్ అన్ ఫిట్ అయిన వారి పిల్లలకు ప్రభుత్వ శాఖలలో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పెండింగులోని కాంట్రాక్టు కార్మికులను రెగ్యూలర్ చేయాలన్నారు. ఈసందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల బిజీలో ఉన్నానని, అసెంబ్లీ సమావేశాలకు ముందే ఆర్టీసీ జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అంతవరకు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ, ఆర్టీసీ అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అవసరమైతే సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సరైన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, కొండారెడ్డి, ఏ రాజు, సాయిబాబా, పీ సుమ్రమణ్యంరాజుతో పాటు పలువురు ఉన్నారు.