S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

,
08/16/2019 - 01:22

చిత్రాలు.. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గురువారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న బ్రహ్మకుమారీలు.
* ప్రగతి భవన్‌లో గురువారం తోబుట్టువుతో రాఖీ కట్టించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్

08/16/2019 - 01:06

గుంటూరు : కృష్ణానది ఎగువ భాగంలో నదికి ఆనుకుని నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి నివాసానికి వరద ముప్పు తప్పింది. కృష్ణానది ఎగువ భాగం నుండి వచ్చే వరదనీరు ఆయన నివాసం వద్ద నుంచి ప్రకాశం బ్యారేజీకి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జలవనరుల శాఖ అధికారులు ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి వరదనీటి మొత్తాన్ని సముద్రంలోకి తరలిస్తున్నారు.

08/16/2019 - 01:05

విజయవాడ : ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నివేదిక నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 60సి నిబంధన కింద గంపగుత్తగా నవయుగ సంస్థకు పనులు కేటాయించడంపై అభ్యంతం వ్యక్తం చేస్తూ నివేదిక అందచేసింది.

08/16/2019 - 01:04

విజయవాడ: విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఉద్యోగులంతా దృఢ సంకల్పంతో కలిసి పని చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. 73వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం నగరంలోని విద్యుత్ సౌధలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

08/16/2019 - 01:02

విజయవాడ, ఆగస్టు 15: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయానికే మొత్తం 70 గేట్లను పూర్తి సామర్థ్యం మేర తొమ్మిది అడుగుల మేర పైకి ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు పూర్తి సామర్థ్యం మేర 9 అడుగులను పైకి ఎత్తి వేయటంతో బ్యారేజీ, వారధి దిగువన చూస్తే ఎక్కడ గేట్లు ఉన్నాయో కూడా తెలియని స్థితి నెలకొంది.

08/16/2019 - 02:21

విజయవాడ: రాష్ట్రంలో స్వాతంత్య్రం అనే పదానికి ప్రతి రూపంగా పరిపాలన సాగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

08/16/2019 - 00:49

విజయవాడ, ఆగస్టు 15: గ్రామ, వార్డు వలంటీర్లే ప్రభుత్వం తరఫున అంబాసిడర్లు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తన స్వరం వారి నోటి వెంట రావాలని, బాగా పని చేసిన వలంటీర్లను నాయకులను చేస్తానని ప్రకటించారు. విజయవాడలో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను గురువారం ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. వివిధ జిల్లాల్లోని వలంటీర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖాముఖిలో పాల్గొన్నారు.

08/16/2019 - 00:46

విజయవాడ, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంప్రదాయంగా నిర్వహించే ఎట్ హోం (తేనేటి విందు) కార్యక్రమాన్ని నగరంలోని రాజ్‌భవన్ లాన్స్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు.

08/15/2019 - 13:23

నల్గొండ:శ్రీశైలం జలశయానికి సంబంధించి పదిగేట్లు ఎత్తివేయటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ ప్రాజెక్టుకు చెందిన మొత్తం 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 9 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 6.18 లక్షల క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 586.4 అడుగులకు చేరుకుంది.

08/15/2019 - 07:03

హైదరాబాద్: ఐటీ ఎగుమతుల్లో దూసుకెళుతున్నామని, ఈ ఏడాది హైదరాబాద్ బెంగళూరును అధిగమించబోతుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ నుంచి రూ. 52 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు ఐదు సంవత్సరాలలో రూ. లక్షా 9 వేల కోట్లకు పెరిగాయని వివరించారు. ఐటీ కంపెనీలకు హైదరాబాద్ నగరం అత్యంత అనుకూలంగా ఉందన్నారు.

Pages