రాష్ట్రీయం

మహంత్ మఠంలో సొరంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 7: తిరుపతి మహంత్ మఠం అద్భుతాలకు, రహస్యాలకు నిలయంగా ఉంటుందన్న సత్యం తాజాగా వెలుగుచూసింది. మహంత్‌లు బసచేసే ప్రత్యేకగదిలో ఒక రహస్య స్వరంగ మార్గం శనివారం వెలుగుచూసింది. ఫిట్‌మెన్‌గా నియమితులైన శ్రీకాళహస్తి ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తనిఖీలకు వెళ్లడంతో ఈ వాస్తవం ప్రపంచానికి తెలిసివచ్చింది. వాస్తవానికి మహంతుమఠం నుంచి తిరుమలకు రహస్య సొరంగ మార్గం ఉందని, ఈ మార్గం నుంచే నాడు మహంతులు, ఆయన శిష్యగణం వెళ్లేవారని ప్రచారం ఉండేది. అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది మాత్రం ఎవ్వరికీ తెలియని పరిస్థితి. శతాబ్ధాల చరిత్రకలిగిన హథిరాంజీ మఠం నిర్వాహకులైన మహంతుల ఆధీనంలో వేలకోట్ల ఆస్తులను, వెలకట్టలేని ఆభరణాలు ఉన్నాయన్నది బహిరంగ రహ స్యం. అయితే ఇటీవల మహంతుగా ఉన్న అర్జున్ దాస్ భూముల విషయంలో తప్పిదాలకు పాల్పడ్డాడని,
ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈక్రమంలో ఫిట్‌మెన్‌గా శ్రీకాళహస్తి ఈఓ చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో మహంతుకు సంబంధించిన ఆస్తులు, ఇతర వివరాలకు సంబంధించి ఆయన తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం మహంతు అర్జునదాస్ బసచేసే గదిని తిలకించారు. గదిలో అడుగుపెట్టగానే ఆ గది అద్భుతాలకు, ప్రాచీన కళాఖండాలకు, పురాతన వస్తువులకు నిలయంగా దర్శనమిచ్చింది. ఇందులో భాగంగానే అబ్బుర పరచే భూగర్భ రహస్యగది, అందులో నుంచి ఓ సొరంగ మార్గం కనిపించడం సంచలనంగా మారింది. ఈ సొరంగం తిరుమలకు మార్గమా.. లేక నాడు రాజులు ఇచ్చిన ఆభరణాలను దాచిపెట్టిన నేలమాళిఘయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వసాధారణంగా మహంతు బసచేసే గదిలోకి ఆయన అంతరంగికులకు తప్ప మరెవ్వరికీ ప్రవేశం ఉండదు. ఈ క్రమంలో అధికారుల తనిఖీల్లో తాజా భూగర్భ రహస్యగది, స్వరంగం వెలుగుచూసింది. సుమారు 500 సంవత్సరాల క్రితం ఉత్తరాది రాష్టమ్రైన హిమాచల్ ప్రదేశ్‌నుంచి కొందరు భక్తబృందంతో హథీరాం బావాజీ తిరుమలకు వచ్చారని ప్రతీతి. అయితే అప్పుడు తిరుమల ఒక అటవీ ప్రాంతంగా ఉండటంతో ఆయనతో వచ్చిన భక్తులు వెళ్లిపోగా హథ్‌రాంబావాజీ మాత్రం స్వామివారి కైంకర్యమే తనకు ప్రధామావదిగా ఉండిపోయారని చెబుతున్నారు. ఆయన ఆలయంలో తిష్టవేసినా అప్పటి ఆలయ సిబ్బంది ఆయన్ను బలవంతంగా వెలుపలికి నెట్టినా ఆయన స్వామి సన్నిధిలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే బావాజీని చెరసాలలో ఉంచడం, స్వామివారు రహస్యంగా ఆయనతో పాచికలు ఆడటానికి వెళ్లేవారని చెబుతుంటారు. అంతేకాకుండా నాటిరాజులు ఆయనకు శిక్ష విధిస్తూ గది నిండా చెరకుగడలను నింపి వాటిని తెల్లవారే లోగా తినేయాలని చెప్పడం, స్వామివారు గజరూపంలో చెరకుగడలను ఆరగించడం జరిగిందని చరిత్ర చెబుతూ ఉంది. ఈనేపథ్యంలోనే మహంతు తిరుమల క్షేత్రానికి ఒక గొప్ప పాలనాధికారిగా అయిన విషయం పాఠకులకు విదితమే. కాగా శనివారం వెలుగు చూసిన సొరంగం మఠం నేలమట్టానికి సుమారు 10 అడుగుల కిందకు దిగితే ఒక సొరంగ మార్గం కనిపించింది. చుట్టూ దట్టమైన చీకటి, చెత్త, దుమ్ము, దూళితో నిండిన పరిస్థితిలో ఆ సొరంగం కనబడింది. అయితే అందుకు ఉన్న ఇనుపగేటు తాళాలు ఎవరి వద్ద ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. తిరుపతి మహంతు మఠంనుంచి తిరుమలకు సుమారు 25కిమీ దూరం ఉంటుంది. ఇంత దూరం పాటు సొరంగం ఉంటుందా.. లేక ఇది కేవలం ఇక్కడికే పరిమితమైనదా అనేది అంతుపట్టని ప్రశ్నగా మారింది. 1843 నుంచి 1933 వరకు తిరుమల శ్రీవారి ఆలయం శతాబ్దకాలం పాటు తమ పాలనలో ఉంచుకున్న విషయం పాఠకులకు విదితమే. ఏది ఏమైనా మహంతు మఠంలో శనివారం వెలుగు చూసిన సొరంగం రహస్యం అధికారుల పూర్తిస్థాయి దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది.
*చిత్రం...హథీరాంజీ మఠం మహంత్ అర్జున్‌దాస్ గదిలో బయటపడిన సొరంగ మార్గం