రాష్ట్రీయం

సీనియర్ సంపాదకుడు పొత్తూరి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం ఇక్కడ స్వగృహంలో కన్ను మూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. ఆయన గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్య కారణాలతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇక్కడ
విజయనగర్ కాలనీలో తన గృహంలో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. 1934 ఫిబ్రవరి 8వ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించిన ఆయన పత్రికా రంగంలో ఐదు దశాబ్థాలకు పైగా సేవలను అందించారు. ఆంధ్రభూమితో పాటు పలు దినపత్రికల్లో ఎడిటోరియల్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి పాత్రికేయ వృత్తిలో నూతన ఒరవడి సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వ్యవహరించారు. పలు తెలుగు దినపత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. ఎందరో సాహిత్యకారులకు బాసటగా నిలిచి తద్వారా తెలుగు భాషాభ్యున్నతికి కారకులయ్యారు. ఆయన భౌతిక దేహానికి గురువారం సాయంత్రం ఇక్కడ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
*సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు (ఫైల్‌ఫొటో )