రాష్ట్రీయం

జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్ళూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)నుండి గురువారం ఇస్రో చేపట్టదలచిన జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్ 10 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేచ్తూ ఇస్రో చైర్మన్ శివన్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన్నట్లు గురువారం సాయంత్రం 5.43 గంటలకు షార్‌లోని 2వ లాంచ్‌ప్యాడ్ నుండి జీఎస్‌ఎల్‌వి - ఎఫ్ -10 రాకెట్ ప్రయోగం జరగవలసిఉంది. దీనికి బుధవారం మధ్యాహ్నం 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావలసివుండగాకొన్ని సాంకేతిక కారణం తలెత్తిన్నట్లు గుర్తించామని షార్ వర్గాలు తెలిపాయి. ఈ అంశాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు మీటింగ్‌లో చర్చాంచారు. సాంకేతిక కారణాలు సరిచేసేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. దీంతో ప్రయోగం వాయిదా వేయాలని బోర్డు నిర్ణయం
తీసుకుంది. ప్రయోగం ఎప్పుడన్నదే త్వరలోనే ప్రకటిస్తామని ఇస్రో ప్రకటించింది. మరో వైపు ఇస్రో చైర్మన్ శివన్ షార్‌కు చేరుకొని సాంకేతిక లోపంపై పర్యవేక్షణ చేపట్టారు. త్వరలోనే జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 10 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేపడతామని ఇస్రో వర్గాలు తెలిపాయి. భారత శాస్తవ్రేత్తలు ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినప్పటికీ ఎప్పటికప్పుడు జిఎస్‌ఎల్‌వి భారీ రాకెట్ల నిర్మాణంలో జాప్యం జరుగుతునే ఉంది. జిఎస్‌ఎల్‌వి సీరిస్‌లో మరింత పరిపూర్ణమైన నైపుణ్యం సాధించేందుకు భారత శాస్తవ్రేత్తల కృషి అవసరం అని తెలుస్తోంది.

*చిత్రం...జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్ 10 రాకెట్