రాష్ట్రీయం

రావికొండలరావు పేరుతో ప్రత్యేక ఎన్వలప్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ప్రముఖ నటుడు, రచయిత రావికొండలరావు పేరుతో భారత తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ మంగళవారం పోస్టల్ స్టాంప్-కవర్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్‌పై రావికొండలరావు ఫోటో ముద్రించారు. తెలుగు ప్రజలకు అందిన గౌరవంగా దీన్ని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభు త్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా, పోస్టల్ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రావి కొండల రావు దాదాపు 600 సినిమాల్లో నటించారు. రాముడు- భీముడు, తేనేమనసులు, దసరాబుల్లోడు, పెళ్లిపుస్తకం, రాధాగోపాలం, అలీబాబా 40 దొంగ లు, చంటబ్బాయి తదితర సినిమాల్లో ఆయన నటించారు. అనేక సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆకాశవాణిలో ఆయన రచనలు 100కు పైగా ప్రసారమయ్యాయి. రావికొండలరావు భార్య రాధాకుమారి కూడా నటి. వీరిద్దరూ కలిసి 127 సినిమాల్లో భార్యాభర్తల పాత్రలు పోషించారు. నిజజీవితంలో భార్యాభర్తలు కలిసి 127 సినిమాల్లో భార్యాభర్తలుగా నటించడం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు.