రాష్ట్రీయం

వటపత్రశాయిగా యాదగిరీశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఆదివారం ఉదయం వటపత్రశాయి ఆలంకార సేవలో, రాత్రి పొన్నవాహన విహారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రళయకాలంలో జగత్తును కాపాడేందుకు మర్రి ఆకుపై పవళించి తన గర్భంలోని లోకాలన్నంటికీ పాదారవిందం చేత నోటి ద్వారా అమృతమును అందిస్తూ జగద్రక్షుడైన స్వామివారు చిన్నికృష్ణుడి రూపంలో వటపత్ర శయనుడిగా అవతరించి లోకాలను రక్షించారు. యాదాద్రి లక్ష్మినరసింహుడు లోక రక్షకుడైన వటపత్ర శాయిగా అలంకార సేవలో దర్శనమిచ్చి భక్త రక్షక్షుడిగా చాటుకున్నారు. రాత్రి 9 గంటలకు కోరిన కోర్కేలు తీర్చే పొన్న (కల్పవృక్షం) వాహనంపై విహరించిన లక్ష్మినరసింహుడు భక్తులకు అభయప్రదాతగా దర్శనమిచ్చారు. స్థానాచార్యులు రాఘవాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, యాజ్ఞీకులు ఫణితాచార్యులు నేతృత్వంలో పాంచరాత్రాగమశాస్త్రానుసారం శాస్తయ్రుక్తంగా మేళతాళాల మధ్య స్వామివారికి అలంకార, విశేష వాహన సేవలు నిర్వహించి బాల ఆలయంలో ఊరేగించారు. పొన్న వాహన రూఢుడైన స్వామివారిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని సంతాన సిద్ధి కలుగుతుందన్న నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసంహామూర్తి విశేష సేవల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా వేద పారాయణాలు, హవనాలు, యాగాది పూజలు శాస్తయ్రుక్తంగా కొనసాగుతుండగా యాదాద్రిలో బ్రహ్మోత్సవ శోభ ఫరిడవిల్లుతోంది. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సోమవారం లక్ష్మీనరసింహస్వామికి గోవర్ధనగిరిధారి అలంకార సేవ, సింహవాహన సేవలు నిర్వహించనున్నారు. రేపు మంగళవారం రాత్రి 9గంటలకు బాల ఆలయంలో స్వామివారికి ఎదుర్కోలు ఘట్టం సాగనుంది.

*చిత్రం...వటపత్రశాయగా అలంకృతుడైన లక్ష్మీనరసింహుడికి మంగళహారతి నివేదన,