రాష్ట్రీయం

ఆర్టీసీకి ఆధునిక హంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 1: ఆర్టీసీ అభివృద్ధి, బలోపేతం దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు డిపోలను ఇంధన సామర్థ్య బస్‌స్టేషన్లుగా ఆధునీకరించటంతో పాటు వైఫై సౌకర్యం, ఇంధన సామర్థ్య ఎల్‌ఈడీ లైటింగ్, ఆధునిక టాయిలెట్ల ఏర్పాటుతో రూపురేఖలు మార్చే యోచనలో ఉంది. ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించే బస్‌స్టేషన్లను అందుబాటులోకి తేవటంతో పాటు ఆధునీకరణ ఎలాచేయాలనే విషయమై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించనున్నారు. రాష్ట్రంలో బస్సుస్టేషన్ల ఆధునీకరణ ప్రక్రియ తిరుపతి నుంచి ప్రారంభించేందుకు అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఇందులోభాగంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్కో)తో సమావేశం నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న 10 మేజర్ బస్‌స్టేషన్లు, 128 బస్సుడిపోలు, నాలుగు వర్క్‌షాపుల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయటంపై చర్చించారు. ఈ బస్‌స్టేషన్లలో ఏడాదికి 30మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుండగా, ఇందుకు ఆర్టీసీ ఏటా రూ. 28కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లిస్తోంది. ఆర్టీసీ డిపోల్లో విద్యుత్ వినియోగం చాలా అధికంగా ఉన్న దృష్ట్యా ఎనర్జీ ఎఫిషియన్సీ అమలుతో భారీగా వినియోగం తగ్గటంతో పాటు విద్యుత్ బిల్లుల భారం ఉండదని భావిస్తున్నారు. అంతేకాదు ఎనర్జీ ఎఫిషియంట్ ఎల్‌ఈడీ లైటింగ్ అమర్చటం ద్వారా బస్‌స్టేషన్లు ఆకర్షణీయంగా మెరుగులు దిద్దుకోనున్నాయి. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం
తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి కావాలనే 50వేల మంది ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఈవిషయంలో లాభనష్టాలను, ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని లెక్కచేయలేదని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీని సుస్థిరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. సౌకర్యాల పెంపు, నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టటం ద్వారా ప్రయాణికులను మెప్పించి ఆర్టీసీ ప్రయాణంపై మరింత ఆసక్తిని పెంచేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ఇంధన సామర్థ్య చర్యలు అమలుచేయాలనే యోచనతో ఉన్నట్లు అధికారులు వివరించారు. పాత, సంప్రదాయ విద్యుత్ ఉపకరణాల స్థానంలో ఎనర్జీ ఎఫిషియంట్ పరికరాలు అమర్చడం ద్వారా విద్యుత్ వృథాను అరికట్టాలనేదే లక్ష్యమని తెలిపారు. ఆర్డీనరీ విద్యుత్ బల్బులు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, పాత ఎయిర్ కండిషనర్లు, పంపుసెట్లు స్థానంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన బీఈఈ స్టార్ రేటెడ్ ఉపకరణాలు అమర్చాలని నిర్ణయించారు. దీనికిముందు బస్‌స్టేషన్లలో ప్రస్తుత ఇంధన వినియోగం ఏ తీరుగా ఉన్నదో పరిశీలించేందుకు ఇంధన నిపుణులతో ఏపీ సీడ్కో ఒక అధ్యయనం నిర్వహిస్తోంది. ఆర్టీసీ ఇంధన సామర్థ్యం సాధించటంతో పాటు విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేస్తోంది. అంతేకాకుండా ఏపీ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం)కు భవిష్యత్‌లో బీఈఈ నుంచి వచ్చే గ్రాంట్లను ఆర్టీసీలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు వినియోగించే విషయం పరిశీలిస్తామని ఏపీ సీడ్కో అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే గృహ, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, వీధిదీపాలు వంటి వివిధ రంగాల్లో చేపట్టిన ఎనర్జీ ఎఫిషియంట్ కార్యక్రమాలు సంతృప్తికరమైన ఫలితాలు అందిస్తున్నాయని సీడ్కో అధికారులు వివరించారు.
ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యం:ప్రతాప్
ఆర్టీసీని ఆధునీకరించటమే కాకుండా ప్రయాణికులకు మరింత స్నేహపూర్వకమైన సంస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య కృతనిశ్చయంతో ఉన్నారని ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. ఆర్టీసీ బస్‌స్టేషన్ అంటే బస్ కోసం కాసేపు ఏదోవిధంగా ఎదురుచూపులు చూసే ప్రాంతంగా కాకుండా ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. ప్రజారవాణా కల్పనలో భాగంగా ఆర్టీసీకి ప్రతిరోజూ కోట్లలో నష్టం వస్తున్నప్పటికీ ప్రజాప్రయోజనాలకే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇందులోభాగంగా బస్‌స్టేషన్లలో ప్రయాణికులకు నాణ్యమైన సర్వీస్‌లు అందించటం, ప్రజారవాణాను మరింత విస్తృత పరచటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బస్‌స్టేషన్లను ఎనర్జీ ఎఫిషియంట్‌గా మార్చటంతో పాటు వైఫై సౌకర్యం, ఆధునిక టాయిలెట్లు వంటి హంగులు, ఆకర్షణీయమైన పెయింటింగ్‌లు వేసి కళాత్మకంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీని బలోపేతం చేయడం, సౌకర్యాలు మెరుగుపరచటంలో భాగంగా ప్రయాణికుల నుంచి వినూత్నమైన సూచనలు, సలహాలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు. బస్‌స్టేషన్లను మెరుగుపరచటంలో భాగంగా ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌తో పాటు కొందరు సీనియర్ అధికారులు గుజరాత్‌లోని వడోదర సెంట్రల్ బస్ టెర్మినల్‌ను సందర్శిస్తున్నారు. బస్‌స్టేషన్లను ఎనర్జీ ఎఫిషియంట్‌గా తీర్చిదిద్దితే ఆర్టీసీకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ప్రజారవాణా సౌకర్యాలు మరింత విస్తృత పరచటం, పటిష్ట పరచటం, బస్‌స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచటం, ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.
ఇంధన పొదుపు లక్ష్యం:శ్రీకాంత్
ఆర్టీసీ బస్‌స్టేషన్లను ఎనర్జీ ఎఫిషియంట్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని స్వాగతిస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఇందువల్ల ఆర్టీసీకి ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు సమకూరుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయటం ద్వారా భారీగా విద్యుత్ వృథాను అరికట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఇంధన శాఖ సమన్వయం, సహకారంతో ఆర్టీసీలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్, చీఫ్ ఇంజనీర్ యూ శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీ శ్రీనివాసాచార్యులు, ఇతర సీనియర్ అధికారులను ఆయన ఆదేశించారు.
*చిత్రం...ఇంధన సామర్థ్య పథకం అమలవుతున్న గుజరాత్ వడోదరలోని
సెంట్రల్ బస్ టెర్మినల్ (ఇన్‌సెట్‌లో) ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్