రాష్ట్రీయం

విశాఖ శ్రీ శారదాపీఠంలో విషజ్వర పీడ హర యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 18: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధితో యావత్ ప్రజానీకం విలవిల్లాడుతోంది. మహమ్మారి వైరస్ దావాలనంలా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తోంది. ఆరోగ్య పరంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దైవానుగ్రహం కూడా ప్రజలకు మేలు చేస్తుందన్న భావనతో విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో విషజ్వర పీడ హర యాగం, అమృత పాశుపతయాగాలను పీఠప్రాంగణంలో బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి సారథ్యంలో పీఠ ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశ గ్రహమైత్రేయి సరిగా లేనందున ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. భారతదేశ జన్మరాశి అయిన ధనూరాశిలో గురుడు, కుజుడు, కేతువు అనే మూడు గ్రహాల కలయిక, వీటిలో రెండు దుష్టగ్రహాలతో గురుగ్రహ వీక్షణ వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు సంభవిస్తాయని జ్యోతిష శాస్త్రంలో స్పష్టంగా ఉంది. మార్చి 23 నుంచి కుజుడు మకర రాశిలో శనితో కలిసి ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకూ దేశానికి కాలసర్ప దోషం ఉంది. ఈ పరిస్థితుల్లో దైవానుగ్రహ కార్యక్రమాలతో విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు 11 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. ఔదుంబర(మేడి) వృక్ష సమిధులు, సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, గోమయంతో చేసిన పిడకలు ఈయాగంలో ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఈ యాగధూళి ప్రజలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని, రుగ్వేద, అధర్వణ వేదాల్లోని ఆరోగ్య మంత్రాలు, యోగావశిష్టంలోని బీజాక్షరాలను సంపుటి చేసి రుత్వికులు యాగం నిర్వహిస్తారని తెలిపారు.

*చిత్రం...యాగాలను పర్యవేక్షిస్తున్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర