రాష్ట్రీయం

శ్రీవారి లడ్డూలన్నీ పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: కరోనా వైరస్ నేపథ్యంలో శుక్రవారం నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించకుండా నిలిపివేసిన నేపథ్యంలో భక్తుల కోసం ముందస్తుగా తయారుచేసిన లడ్డూలను టీటీడీ ఉచితంగా ఉద్యోగులకు అందించింది. సుమారు 2.50లక్షల లడ్డూలు భక్తులను స్వామిదర్శనం నిలిపివేసే సమయానికి మిగిలిపోయాయి. అయితే ఈ లడ్డూలను ఏమి చేయాలనే విషయంపై టీటీడీ అధికారులు తర్జన, భర్జన పడిన అనంతరం ఉద్యోగస్తులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ప్రతి మాసం ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగికి 10లడ్డూల చొప్పున సబ్సీడీ ధరపై అందిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌తో అనుకోకుండా మిగిలిపోయిన లడ్డూలను భక్తులకు కేటాయిస్తే ఏమైనా సమస్యలోస్తాయేమోనని, ముఖ్యంగా ఈ లడ్డూలు ఉచితంగా ఇచ్చిన తరువాత భక్తులకెవ్వరికైనా చిన్న సమస్య వచ్చినా అది లడ్డూల కారణంగా వచ్చిందన్న ప్రచారం సాగి టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఇబ్బందులేమైనా వచ్చినా తమకెలాంటి ఇబ్బంది లేదన్న భావనలో ఉన్న ఉద్యోగులకు ఇవ్వడమే మంచిదని నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా తిరుమల, తిరుపతిలో ఉన్న జర్నలిస్టులకు కూడా ఐదు లడ్డూల చొప్పున ఉచితంగా అందించారు. 2.50లక్షల లడ్డూలను ఒక్కసారిగా ఉచితంగా ఇవ్వడం టీటీడీ చరిత్రలో ఇదే ప్రధమమని చెప్పక తప్పదు.

*చిత్రాలు..కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడంతో
నిర్మానుష్యంగా మారిన ఆలయ పరిసర ప్రాంతాలు
*తిరుమలలో మిగిలిపోయిన లడ్డూలను పంపిణీకి సిద్ధం చేస్తున్న దృశ్యం