రాష్ట్రీయం

వారెవ్వా..ఇస్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 16: రోదసీ ప్రయోగాల్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తాము సాధించిన నిరుపమాన ప్రజ్ఞాపాటవాలను ఇస్రో శాస్తవ్రేత్తలు చాటిచెప్పారు. సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను పోలార్ ఉపగ్రహ వాహక నౌక (పిఎస్‌ఎల్‌వి-సి 29) ద్వారా రోదసీ కక్ష్యలోకి బుధవారం దిగ్విజయంగా ప్రవేశ పెట్టగలిగారు. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మక రీతిలో చేపట్టిన ఈ ప్రయోగం రోదసీ వాణిజ్యాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు దోహదం చేస్తుంది. భూ పరిశీలన నిమిత్తం టెలియోస్ ఉపగ్రహంతో పాటు మరో ఐదు చిన్న ఉపగ్రహాల ప్రయోగ విజయం భారత్ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయంగా మరింత పెంచింది. సోమవారం ఉదయం 7గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై నిరాటకంగా సాగిన అనంతరం బుధవారం సాయంత్రం 6గంటలకు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పిఎస్‌ఎల్‌వి-సి 29రాకెట్ నారింజ, ఎరుపు రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరిన అనంతరం తన నాలుగు దశలను సునాయాసంగా పూర్తిచేసుకొని ఆరు ఉపపగ్రహాలను 21.2 నిమిషాలకు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘన విజయాన్ని నమోదు చేసుకున్న శాస్తవ్రేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆరు విదేశీ ఉపగ్రహాలను రోదసీ కక్ష్యలోకి ఏకకాలంలో ప్రవేశ పెట్టడం ఓ అద్భుమైన విజయమని అభివర్ణించారు. పిఎస్‌ఎల్‌వి-సి 29 ద్వారా సింగపూర్ దేశానికి చెందిన 400కిలోల బరువుగల టెలియోస్ ఉపగ్రహం, 123కిలోల బరువుగలల వెలక్స్-సి 1, 13కిలోల బరువుగల వెలక్స్-2, 3.4కిలోల బరువుగల గలాసీయా, 78కిలోల బరువుగల యాథనక్సట్, కెన్ట్‌రిడ్జి అనే మరో చిన్న నానో ఉపగ్రహం మొత్తం 629కిలోల బరువుగల ఆరు ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి-సి 29 రాకెట్ ఒక దాని తరువాత ఒకటి వరుసగా ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లి 550కిలో మీటర్ల దూరంలోకక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో షార్‌లో ఒకసారిగా సందడి వాతావరణం నెలకొంది. ఈ రాకెట్ తయారీకి ఇస్రో రూ.175 కోట్లు వెచ్చించింది. రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరిన తరువాత ఒకదాని తరువాత ఒకటి నిర్దేశించిన సమయానికే నాలుగు దశలను పూర్తిచేసుకొని రాకెట్ నుండి ఉపగ్రహాలు విడిపోయి కక్ష్యలోకి చేరాయి. ఎంసిసిలో రాకెట్ గమనాన్ని సూపర్ కంప్యూటర్ల ద్వారా గమనించిన రేంజ్ ఆపరేషన్ అధికారులు రాకెట్ నాలుగు దశలు పూర్తిచేసినట్లు నిర్థారించారు. అక్కడే ఉన్న ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ రాకెట్ విజయవంతం అయిందని ప్రకటించి అక్కడే ఉన్న శాస్తవ్రేత్తలను అభినందన పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. మిషన్ కంట్రోలర్ సెంటర్ నుండే చైర్మన్ మాట్లాడుతూ ఈ రోజు ఇస్రో చరిత్రలో చిరస్థాయిగా నిలచిన రోజన్నారు. ప్రయోగంలో పాలుపంచుకొన్న శాస్తవ్రేత్తలను ఆయన అభినందించారు. భూ పరిశీలన నిమిత్తం సింగపూర్ ఉపగ్రహాలను ఇస్రో మొట్టమొదటి సారిగా చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల్లో ఆనందోత్సవాలు వెల్లువిరిస్తున్నాయి. ఇస్రోకు ఇది పూర్తి వాణిజ్య రంగానికి చెందినదన్నారు. 50వ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ముఖాల్లో ఆనందాలు వెల్లువిరిశాయి. శాస్తవ్రేత్తల కఠోర శ్రమతోనే షార్ కేంద్రం ఈ స్థాయికి చేరిందన్నారు.
44.4మీటర్ల పొడవు 320టన్నుల బరువుగల పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహక నౌక ప్రయాణం నాలుగు దశలుగా సాగింది. మొదటి దశలో ఘన బూస్టర్లసాయంతో ప్రయోగం ప్రారంభమైంది. రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధన సాయంతో రాకెట్ పయనించి ఉపగ్రహాలను రోదసీలోని నిర్ణీత కక్ష్యలోకి 21.2నిమిషాల్లో ప్రవేశపెట్టడం విశేషం.
రాకెట్ విడిపోయింది ఇలా...
రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరినంతరం తన అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. కౌంట్‌డౌన్ పూర్తయ్యినంతరం రాకెట్ భూమి నుండి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు కదిలింది. తన మొదటి దశ 451కిలో మీటర్ల వేగంతో 1.53నిమిషాలకు 56కిలో మీటర్ల ఎత్తుకు చేరినంతరం తొలిదశ మోటారు రాకెట్ నుండి విడిపోయింది. రెండో దశ మోటారు అంటుకొని సెకనుకు 4326కిలో మీటర్ల వేగంతో 4.20నిమిషాలకు 199కిలో మీటర్ల ఎత్తుకు చేరినంతరం రెండో దశ మోటారు విడిపోయింది. మూడో దశ 7518కిలో మీటర్ల వేగంతో 9.44నిమిషాలకు 479కిలో మీటర్ల ఎత్తుకు చేరినంతరం నాలుగో దశ ప్రారంభమై 7581 మీటర్ల వేగంతో 17.25నిమిషాలకు 550కిలో మీటర్ల ఎత్తుకు చేరింది. 18.12నిమిషాలకు టెలిమోస్ ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. అనంతరం కెన్టురిడ్జి, వెలక్స్-సి1, వెలక్స్-2, గలాసీయా,యాథనక్సట్ ఉపగ్రహాలు రాకెట్ నుండి విడిపోయి 21.2నిమిషాలకు కక్ష్యలోకి చేరాయి.
చిత్రం.. రోదసీ కక్ష్యలోకి దూసుకుపోతున్న పిఎస్‌ఎల్‌వి-సి 29