S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/17/2015 - 13:15

గుంటూరు: నగరంలో ఓ యువకుడు విద్యార్థినిపై సుత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన వెంకటరమణకు తల్లిదండ్రులు లేరు. ఆమె తన బంధువుల సహాయంతో మహిళా ప్రాంగణంలో ఉంటూ గుంటూరులోని మహిళా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇవాళ ఉదయం కళాశాలకు చేరుకోగా... సైకిళ్లు నిలుపుదల చేసే ప్రదేశంలో ఓ యువకుడు తనతో పాటు తీసుకొచ్చిన సుత్తితో ఆమెపై దాడి చేసి ఉడాయించాడు.

12/17/2015 - 12:55

హైదరాబాద్‌: ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. కాల్‌ మనీ వ్యవహారంపై చర్చించాలని వైకాపా సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో రెండు సార్లు సభ వాయిదా పడింది. కాల్‌మనీపై రేపు ప్రకటన చేస్తామని సీఎం స్పష్టం చేసిన తర్వాత కూడా వైకాపా సభ్యుల తీరు మారకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. శాసన మండలి కూడా శుక్రవారానికి వాయిదా పడింది.

12/17/2015 - 12:54

హైదరాబాద్‌: గోకుల్‌చాట్‌ బాంబు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. చంచల్‌గూడ నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య నిందితులను కోర్టుకు తరలించారు.

12/17/2015 - 12:54

హైదరాబాద్‌:శాసనసభలో రేపు ఉదయం ప్రకటన చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో చంద్రబాబు మాట్లాడతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై శాసన సభలో ప్రత్యేక చర్చ చేపట్టేందుకు సభను ఆర్డర్‌లో ఉంచాలని స్పీకర్‌ను కోరారు.

12/17/2015 - 07:06

హైదరాబాద్, డిసెంబర్ 16: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అన్ని ప్రజాసమస్యలను చర్చించేందుకు వైకాపా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఎదురుదాడి చేస్తే తిప్పికొడతామని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని బిఏసి సమావేశంలో తమ పార్టీ కోరుతుందని ఆయన పేర్కొన్నారు.

12/17/2015 - 07:09

విజయవాడ, డిసెంబర్ 16: బూజు పట్టిన బ్రిటిష్ విధానాలను వదిలిపెట్టి భూమి రికార్డులను నవీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విజయవాడలో మూడు రోజుల పాటు జరిగే జాతీయ భూమి రికార్డుల నవీకరణ శిక్షణ వర్క్‌షాప్ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపి)ని బుధవారం ప్రారంభించిన ముఖ్యమంత్రి భూమి రికార్డులను అధునీకరించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

12/17/2015 - 07:05

విజయవాడ, డిసెంబర్ 16: విజయవాడలో మొదలై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కాల్‌మనీ సెగ ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిజిపి జెవి రాముడు ఆదేశాల మేరకు బుధవారం కూడా పోలీసు వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 150 మందికిపైగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 130కిపైగా కేసులు నమోదయ్యాయి.

12/17/2015 - 07:04

హైదరాబాద్, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో రెవిన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను నవీకరించడం, డిజిటలైజ్ చేయడం, సరికొత్త ఆధునిక రికార్డు రూమ్స్‌లో వాటిని మండలస్థాయిలో భద్రపరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 15 కోట్లు ఖర్చు చేసి గ్రామపటాలను డిజిటలైజ్ చేసింది. మరో 20 కోట్లు వెచ్చించి ఎఫ్‌ఎంబిలు సిద్ధం చేశారు.

12/17/2015 - 06:56

ధర్మపురి / చిట్యాల, డిసెంబర్ 16: కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని స్థంభంపెల్లి - కొత్తపెల్లి మార్గ మధ్యన వరంగల్ - రాయపట్నం రాష్ట్ర రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విగతజీవులైనారు. ఆదిలాబా ద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూ రు, గంపలపల్లె వాస్తవ్యులు.

12/17/2015 - 06:47

కడప,డిసెంబర్ 16: కడప జిల్లాలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన గాలివీడు సమీపంలో నిర్మించిన వెలిగల్లు ప్రాజెక్టులో భారీఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. దీంతో ఈ విషయమై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జలవనరులశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కాల్వల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నారు.

Pages