S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/16/2016 - 05:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:యావద్భారతం మండిపోతోంది. చండప్రచండ వడగాడ్పులతో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత శుక్రవారం 40డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత 42.2డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.నిన్నటి కంటే రెండు డిగ్రీల మేర ఎండలు పెరిగిపోవడంతో దేశ రాజధాని వాసులు బెంబేలెత్తిపోయారు.

04/16/2016 - 05:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: రెండు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినియోగదారులకు శుక్రవారం స్వల్ప ఊరటనందించింది. పెట్రోలుపై లీటరుకు 74 పైసలు, డీజిల్‌పై రూ.1.30పైసల చొప్పున తగ్గించింది. మారిన ఈ రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.61.13 పైసలకు తగ్గింది. అలాగే డీజిల్ రేటు కూడా రూ.49.31పైసల నుంచి 48.01 పైసలకు తగ్గింది.

04/15/2016 - 18:06

నాసిక్: మహారాష్టల్రోని త్య్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలని దేవస్థానం ట్రస్టుబోర్డు నిర్ణయించినప్పటికీ కొన్ని షరతులను విధించడం తగదని మహిళా హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గర్భగుడిలోకి ఉదయం 6 నుంచి 7 గంటల వరకూ గంటసేపు మాత్రమే మహిళలు రావాలని, తడిగా ఉన్న కాటన్ లేదా సిల్కు దుస్తులనే ధరించాలని ట్రస్టుబోర్డు కొన్ని షరతులు విధించింది.

04/15/2016 - 18:06

ముంబయి: ‘బాలికా వధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్యకు కారకుడైన ప్రియుడు రాహుల్‌రాజ్ సింగ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తల్లి సోమా బెనర్జీ మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. రాహుల్ వేధింపులకు, వంచనకు తాళలేక తన కుమార్తె మరణించిందని ఆమె ఆరోపించారు. ఎంతోమంది యువతులను మోసగించిన రాహుల్ ఇపుడు ప్రత్యూష ఆత్మహత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నట్లు సోమా పేర్కొన్నారు.

04/15/2016 - 18:05

విశాఖ: నీటిఎద్దడి కారణంగా మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లు రద్దయినందున కొన్ని మ్యాచ్‌లనైనా విశాఖలో జరపాలని ఆంధ్రా క్రికెట్ సంఘం బిసిసిఐకి లేఖ రాసింది. బాంబే హైకోర్టు ఆదేశాలతో ముంబయి, పూణె నగరాల్లో జరగాల్సిన 13 మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. రద్దయిన మ్యాచ్‌లను విశాఖ, కాన్పూర్, రాయ్‌పూర్‌లో నిర్వహించాలని బిసిసిఐ యోచిస్తున్నట్లు సమాచారం.

04/15/2016 - 18:04

గౌహతి: గ్రామపెద్దల నిర్ణయాన్ని కాదని ఎన్నికల్లో వేరే పార్టీకి ఓటు వేసినందుకు ఆగ్రహించి భార్యకు విడాకులిచ్చేశాడు ఓ భర్త. అస్సాం అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో సోనిట్‌పూర్ జిల్లా డోనం అడ్డహతి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని గ్రామపెద్దలు తీర్మానించారు. అయితే, గ్రామపెద్దల తీర్మానానికి విరుద్ధంగా బిల్వారా బేగం బిజెపికి ఓటు వేసింది.

04/15/2016 - 18:03

విశాఖ: నీటి ఎద్దడి కారణంగా మహారాష్టల్రో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరపరాదని బాంబే హైకోర్టు ఆదేశించడంతో కొన్ని మ్యాచ్‌లు విశాఖలో జరిగే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్ పారిస్ మాంబ్రే శుక్రవారం ఇక్కడి మధురవాడ క్రికెట్ స్టేడియంను పరిశీంచారు. ఈ స్టేడియంలో సౌకర్యాలు బాగున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

04/15/2016 - 18:02

దిల్లీ: దేశం నుంచి పారిపోయి లండన్‌లో కొంతకాలంగా ఉంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ ఎంపీ విజయ్ మాల్యా పాస్‌పోర్టును ఇక్కడి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు రద్దు చేశారు. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు చెల్లించనందున తమ వద్ద హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం (ఈడీ) ఇదివరకే పలుసార్లు కోరింది.

04/15/2016 - 18:01

లక్నో: మైనారిటీల ఓట్ల కోసం హిందువులకు అన్యాయం చేయడం తగదని ద్వారకా శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇతర మతాల్లో స్ర్తిల పట్ల కొనసాగుతున్న వివక్షను వారు ఎందుకు ప్రశ్నించరని ఆయన నిలదీశారు.

04/15/2016 - 18:00

రాయ్‌పూర్: శ్రీరామనవమి రోజున దుండగులు విధ్వంసం సృష్టించేందుకు పథకం వేసినా పోలీసులు అప్రమత్తం కావడంతో చత్తీస్‌గఢ్‌లో పెను ప్రమాదం తప్పింది. సుకుమా జిల్లాలోని సున్నంగుడ రామాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బాంబులు పెట్టినట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు బాంబుస్క్వాడ్‌తో వచ్చి వాటిని తొలగించారు.

Pages