S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/14/2016 - 04:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఆచారాలపేరుతో శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ‘ఆచారాల పేరుతో మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించలేరు. ఇది రాజ్యాంగ విరుద్ధం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

04/14/2016 - 04:23

యాంగన్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: మైన్మార్‌ను బుధవారం రాత్రి పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.9పాయింట్ల తీవ్రతతో సంభవించిన భూకంప తాకిడికి భారత్‌లోని అనేక రాష్ట్రాలు గురయ్యాయి.

04/13/2016 - 18:37

చెన్నై: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డిఎంకెల మధ్య బుధవారం సీట్ల సర్దుబాటు కుదిరింది. 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో 21 చోట్ల కాంగ్రెస్, 9 చోట్ల డిఎంకె పోటీ చేస్తాయి. మే 16న పోలింగ్ జరుగుతుంది.

04/13/2016 - 18:36

ముంబయి: తీవ్ర నీటికొరత ఏర్పడిన దృష్ట్యా ఏప్రిల్ 30 తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదని బాంబే హైకోర్టు బిసిసిఐ (్భరత క్రికెట్ కంట్రోల్ బోర్డు)ని బుధవారం ఆదేశించింది. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ‘పిచ్’లు తడిపేందుకు భారీగా నీటిని వృథా చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.

04/13/2016 - 16:43

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన పాస్‌పోర్టును వెనక్కితీసుకోవాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దిల్లీలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని కోరింది. పలు బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సిన మాల్యాను విచారణకు హాజరు కావాలని తాము పలుసార్లు సమన్లు పంపినా స్పందించడం లేదని ఈడీ చెబుతోంది.

04/13/2016 - 16:41

దిల్లీ: ఆదాయానికి మించి ఆస్తులను కలిగినందున యుపి మాజీ సిఎం మాయావతిపై తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీన్ని విచారించేందుకు కోర్టు స్వీకరించింది.

04/13/2016 - 13:56

రాంచీ: తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నుంచి గట్టెక్కేలా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ భక్తులు నిప్పుల గుండంలో నడిచారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలోని చిటియాలో బుధవారం నాడు భక్తులు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నిప్పులపై నడిచారు. ఇలా నడిస్తే ఈశ్వరుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత వాసుల విశ్వాసం.

04/13/2016 - 13:56

దిల్లీ: స్థానిక విద్యార్థుల దాడుల నుంచి తమను కాపాడాలని కోరుతూ శ్రీనగర్ నిట్‌కు చెందిన స్థానికేతర విద్యార్థులు బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రారంభించారు. ఇటీవల క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినపుడు స్థానిక విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారని, దీన్ని తాము ప్రశ్నించగా దాడులకు దిగుతున్నారని స్థానికేతర విద్యార్థులు చెబుతున్నారు.

04/13/2016 - 13:55

హరిద్వార్: హనీమూన్ పేరిట కొత్తగా పెళ్లయిన వారు పుణ్యక్షేత్రాలకు వస్తూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే వరదలు సంభవిస్తున్నాయని ద్వారకా శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, 2013లో కేదారినాథ్‌లో వరదలకు ఈ అపవిత్ర పనులే కారణమన్నారు.

04/13/2016 - 08:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో పేరుకు పోతున్న లక్షలాది కోట్ల రూపాయల మొండి బకాయిల పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వ్యక్తులు తమ కంపెనీలు దివాలా తీశాయంటూ తప్పించుకు పారిపోతున్నారని, కానీ, 15వేలు, 20వేలు మేర చిన్న రుణాలు తీసుకున్న పేద రైతులు వేధింపులకు గురవుతున్నారని సుప్రీం కోర్టు చురక వేసింది.

Pages