S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/15/2016 - 13:02

దిల్లీ: దేశ రాజధానిలో సిగరెట్లు, బీడీలు, గుట్కాలు వంటి పొగాకు ఉత్పత్తులను ఏడాదిపాటు నిషేధించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దిల్లీ ఆరోగ్య శాఖ ఆదేశాలు విడుదల చేసింది. దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలోనూ ఇలాంటి ఆదేశాలే విడుదలైనా అమలులో మాత్రం ఫలితం కనిపించలేదు.

04/15/2016 - 03:45

ముంబయి, ఏప్రిల్ 14: దేశంలోని నదీ తీరప్రాంత రేవులను అభివృద్ధి చేయడానికి లక్ష కోట్ల రూపాయలమేర పెట్టుబడులు సేకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ ప్రకటించారు. దేశంలోని 7,500 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని ప్రగతి ఇంజన్‌గా మారుస్తామని వెల్లడించారు. సురక్షితంగా, భద్రతాయుతంగా సంతృప్తికరంగా ఈ తీర ప్రాంతాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

04/15/2016 - 03:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ 125వ జయంతిని దేశమంతటా ఘనంగా నిర్వహించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి మహమ్మద్ హమీద్ అన్సారీ గురువారం పార్లమెంటు లాన్స్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఆయన విశ్వ మానవుడని ప్రశంసించారు.

04/15/2016 - 03:37

నాగ్‌పూర్, ఏప్రిల్ 14: దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌పై ఇక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు.

04/15/2016 - 03:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడయిన రాబర్ట్ వాద్రా తనకు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికి ఎలాంటి విముఖత లేదని గురువారం సూచనప్రాయంగా చెప్పారు. ప్రజలకోసం పనిచేయాలని తాను భావించినప్పుడు, అందుకు సంబంధించిన అవకాశాలు కూడా తలుపుతట్టినప్పుడు ఎవరూ కూడా వాటిని కాదనలేరని వాద్రా తెలిపారు. అయితే తన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు.

04/15/2016 - 03:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు జరిపించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం గురువారం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనుగోలునూ మంత్రుల బృందం పరిశీలనలోకి తీసుకుంది. ఈ బృందానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వం వహిస్తారు.

04/15/2016 - 03:35

ముంబయి, ఏప్రిల్ 14: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సుమారు మూడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కుటుంబం గురువారం బౌద్ధమతాన్ని స్వీకరించింది. హిందూమతంలోని కుల వ్యవస్థ అణచివేత నుంచి విముక్తి కోసమే బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు రోహిత్ కుటుంబం ప్రకటించింది.

04/15/2016 - 03:32

లక్నో, ఏప్రిల్ 14: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దళితులు, వెనకబడిన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దళితుల పట్ల మొసలికన్నీరు కార్చడమే తప్ప వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన దాఖలాలే లేవని గురువారం ఇక్కడ ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గం బిజెపికే ఆయనేమీ చేయలేకపోయారని మాయావతి ఎద్దేవా చేశారు.

04/15/2016 - 03:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తున్నా ఫలితాలు సాధించలేకపోతున్నారు, అవినీతిని అరికట్టలేకపోతున్నారు, మంత్రులను అదుపు చేయలేకపోతున్నారని సిఎంఎస్ సర్వే తేల్చింది. చంద్రబాబు రెండేళ్ల పాలనపై సిఎంఎస్ మార్చి నెలలో జరిపిన సర్వే ఫలితాలను సంస్థ అధినేత డాక్టర్ ఎన్.్భస్కర్‌రావు గురువారం విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు.

04/15/2016 - 01:55

మహూ(ఎంపీ), ఏప్రిల్ 14: బాబాసాహెబ్ అంబేద్కర్ సాధారణ మనిషి కారని.. ఆయన ధైర్యానికి, పట్టుదలకు ప్రతిరూపమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సమానత్వం, గౌరవం కోసం ఆయన పోరాటం సాగిందని మోదీ కొనియాడారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్ జన్మస్థలం మహూలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

Pages