S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/16/2016 - 12:38

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను శుక్రవారం రాత్రి ఇక్కడి లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

04/16/2016 - 07:33

నాసిక్, ఏప్రిల్ 15: ఆలయ ప్రవేశంలో స్ర్తి పురుష సమానత్వం పాటించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిరోజూ గంటసేపు గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలని మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర దేవస్థానం ట్రస్టు నిర్ణయించింది. అయితే గర్భగుడిలో పూజలు చేసేటప్పుడు వారు తడి నూలు వస్త్రాలు లేదా పట్టు వస్త్రాలు ధరించాలని షరతు పెట్టింది.

04/16/2016 - 07:25

వెల్లింగ్టన్, ఏప్రిల్ 15: యుద్ధాల్లో తుది విజయం సాధించడానికి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి త్రివిధ దళాల మధ్య పూర్తి సమన్వయం అవసరమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.

04/16/2016 - 07:22

శ్రీనగర్, ఏప్రిల్ 15: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా శుక్రవారం ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఆందోళనకారులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. మృతి చెందిన విద్యార్థి 11వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది.

04/16/2016 - 07:22

ముంబయి, ఏప్రిల్ 15: రెండు వేల సంవత్సరాలకు పైగా చైనాపై భారత్ సాంస్కృతికంగా ఆధిపత్యం చెలాయించిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఒక్క సైనికుడ్ని కూడా పంపకుండా సముద్రా మార్గాల ద్వారానే ఈ ఘనతను భారత్ సాధించిందని మారిటైమ్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా రాజ్‌నాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఈ సదస్సులో మాట్లాడిన ఆయన గంగానదీ తలాలే నాగరిక ఆలోచనలకు పుట్టినిల్లని అన్నారు.

04/16/2016 - 07:21

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఉగ్రవాదం, వాతావరణ మార్పు, అసమానతలు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లని పేర్కొంటూ, మహావీర్ జైన్ ప్రవచించిన మూడు సూత్రాలు అహింస, అనేకాంత్ (్భన్నత్వంలో ఏకత్వం), అపరిగృహ (పరిత్యాగం)లు ఈ మూడు సవాళ్లకు పరిష్కారాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు.

04/16/2016 - 07:21

రనాఘాట్, ఏప్రిల్ 15: ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పోలీసు అధికారులను బదిలీ చేసినా ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలు ఎంత మాత్రం తగ్గవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌కు తన ధిక్కార స్వరాన్ని మరింత పదునుగా వినిపించిన మమత‘నేను ఏమి చేయలనుకుంటే అదే చేస్తాను. ఎలా మాట్లాడలనుకుంటే అలాగే మాట్లాడతాను’అని తీవ్ర స్వరంతో అన్నారు.

04/16/2016 - 07:20

చెన్నై, ఏప్రిల్ 15: తమిళ జాలర్ల విషయంలో డిఎంకె అధినేత కరుణానిధి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. కచ్చతీవుదీవువిషయంలో కోర్టుకు వెళ్లకుండా దాన్ని శ్రీలంకకు అప్పగించిన పాపం కరుణదేనని, ఆ విషయంలో భారత్ ప్రభుత్వానికి ఆయన అన్ని విధాలుగా సహకరించారని జయ ధ్వజమెత్తారు.

04/16/2016 - 07:20

ఇస్లామాబాద్, ఏప్రిల్ 15: భారత్‌తో శాంతి చర్చలు నిలిచిపోయాయన్న వాదనను పాకిస్తాన్ తిరస్కరించింది. ఇరుదేశాల మధ్య మొదలైన శాంతి ప్రక్రియ మొదలవుతుందని ఇందుకు సంబంధించి తాము భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని పాక్ వెల్లడించింది. అన్ని రకాలుగానూ పరిస్థితులను చక్కదిద్దేందుకు ముందుకు వెళ్లాలే తప్ప అవకాశాలను జారవిడుచుకోకూడదని పాక్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది.

04/16/2016 - 07:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశ రాజధానిలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రెండోదశ సరి బేసి నియమం శుక్రవారం నుండి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. రాజధాని రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించాలని, కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో గతంలో ఈ సరిబేసి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది.

Pages