S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/18/2016 - 07:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఓ వైపు మానవ జీవితాలపై కాలుష్యం ప్రభావం అనేక దుష్పరిణామాలకు కారణమవుతూ ఉంటే చారిత్రిక కట్టడాలను సైతం అది వదిలిపెట్టడం లేదని, వాయు కాలుష్యం కారణంగా వాటిపై కూడా తీవ్ర దుష్ప్రభావం పడుతోందని నిపుణులు అంటున్నారు.

04/18/2016 - 07:25

చెన్నై, ఏప్రిల్ 17: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డిఎంకె ప్రభుత్వం, డిఎంకె పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బిజెపి ఆదివారం ఆరోపించింది. ఈ రెండు ద్రవిడ పార్టీలు కూడా అవినీతితో నిండిన అసమర్థ పాలనను అందించాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తూ, అదే ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి తావులేని సుపరిపాలనను అందించారని పేర్కొంది. ‘మోదీజీ అవినీతికి తావు లేని సుపరిపాలనను అందించారు.

04/18/2016 - 07:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారత్‌లో దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్న పాకిస్తాన్‌కు చెందిన మైనారిటీ మతస్థులు త్వరలో భారత్‌లో ఆస్తులను కొనుగోలు చేయడానికి, బ్యాంకు ఖాతాలను తెరవడానికి అనుమతి లభించనుంది. పాన్ కార్డులు, ఆధార్ కార్డులను కూడా పొందనున్నారు. మోదీ ప్రభుత్వం వీరికి ప్రత్యేక సౌకర్యాలను కల్పించడానికి కసరత్తు చేస్తోంది.

04/18/2016 - 07:23

తిరువనంతపురం, ఏప్రిల్ 17: సినీ నటులు, డైరెక్టర్లు కత్తులు నూరుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు విసురుకుంటున్నారు. కేరళలో మే 16న జరుగనున్న ఎన్నికల్లో కోలీవుడ్‌కు చెందిన కనీసం ఆరుగురు సెలబ్రిటీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

04/17/2016 - 18:04

గాంధీనగర్:పటేళ్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్‌ను జైలునుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాష్టవ్య్రాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహించిన ఆందోళనకారులు సోమవారంనాడు రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చారు. పటేళ్లకు ఒబిసి రిజర్వేషన్లు కల్పించాలని కొద్దినెలల క్రితం హార్దిక్ పటేల్ నేతృత్వంలో ఉద్యమం ప్రారంభమైన విషయం తెలిసిందే.కాగా కొద్దిరోజుల క్రితం ఆయనను అరెస్టు చేసి కస్టడీకి పంపించారు.

04/17/2016 - 18:03

సూరత్:పటేళ్ల జైల్‌భరో కార్యక్రమం హింసాత్మకంగా మారింది. మెహసనా నగరంలో పరిస్థితులు చేయిదాటిపోవడంతో కర్ఫ్యూ విధించారు. హార్దిక్ పటేల్ విడుదలకోసం చేపట్టిన జైల్‌భరో కార్యక్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వివాదాన్ని రగిల్చింది. ర్యాలీ నిర్వహించేందుకు ఆందోళనకారులు సిద్ధపడగా పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో 12మందికి గాయాలయ్యాయి. మరోవైపు సూరత్‌లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

04/17/2016 - 16:42

బిహార్:కాశీకి వెళ్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప.గో. జిల్లాకు చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో వారణాసి నుంచి గయకు వెడుతూండగా ఆగిఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో మాచవరం సత్యనారాయణ, ఆయ సతీమణి సరస్వతి, కొడుకు పవన్, తల్లి పద్మావతి దుర్మరణం పాలయ్యారు.

04/17/2016 - 16:41

సూరత్:పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమించిన హరీష్ పటేల్‌ను జైలునుంచి విడుదల చేయాలని కోరుతూ ఆదివారంనాడు గుజరాత్ అంతటా జైలుభరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పటేళ్లు ఆందోళనకు దిగారు. మహేసినాలో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది.

04/17/2016 - 16:39

కోల్‌కత: పశ్చిమబంగ రాష్ట్రంలో ఆదివారం జరిగిన మలివిడత పోలింగ్‌లో హింస చోటుచేసుకుంది. పలుచోట్ల ప్రధాన తృణమూల్, లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మాల్దా, బీరబూమ్‌లలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

04/17/2016 - 02:39

భోపాల్, ఏప్రిల్ 16: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండటం పట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గత మూడేళ్లలో ఈ పెండింగ్ కేసులు పెరుగుతున్న వేగం కాస్త తగ్గిందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడి నేషనల్ జుడీషియల్ అకాడమీలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నాలుగో సదస్సులో సదానంద గౌడ మా ట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

Pages