S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/18/2016 - 18:18

తిరువనంతపురం: ప్రియురాలి కుమార్తెను, ఆమె అత్తను హత్యచేసినందుకు ఓ ఐటి ఉద్యోగికి స్థానిక జిల్లా కోర్టు సోమవారం ఉరిశిక్షను విధించింది. ఈ హత్యలకు సహకరించిన ప్రియురాలికి జీవితఖైదు విధించారు. ఇక్కడి టెక్‌పార్క్‌లో నినో మాథ్యూ, అనుశాంతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తూ ప్రేమలో పడ్డారు. తన కుటుంబ సభ్యులను చంపాలని అనుశాంతి పథకం వేసి ప్రియుడి సహకారాన్ని కోరింది.

04/18/2016 - 18:16

దిల్లీ: సుమారు 9వేల కోట్లరూపాయల మేరకు రుణాలను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ సంస్థ యజమాని విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ అయింది. అనేక కేసుల్లో ఇరుక్కొన్న ఆయన ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన పాస్‌పోర్టును తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో సోమవారం నాడు మనీలాండరింగ్ నిరోధక విభాగానికి చెందిన ప్రత్యేక కోర్టు ఈ వారంటు జారీ చేసింది.

04/18/2016 - 18:15

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని చింతగుప్ప అటవీ ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు బాంబు పేల్చారు. ఈ ఘటనలో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వెంటనే వారిని వైద్యచికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించారు.

04/18/2016 - 16:30

దిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురాలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వజ్రాన్ని తిరిగి భారత్‌కు త తీసుకురావాలంటూ ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది.

04/18/2016 - 16:30

దిల్లీ: దేశ రాజధానిలో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు ఆప్ సర్కారు ప్రవేశపెట్టిన ‘సరి-బేసి’ విధానాన్ని అతిక్రమించినందుకు బిజెపి ఎంపీ విజయ్ గోయల్‌కు పోలీసుల రెండువేల రూపాయల జరిమానా విధించారు. సరి-బేసి నిబంధనలకు విరుద్ధంగా సోమవారం కారులో వెళుతున్న గోయల్నను ఆపి దిల్లీ రవాణామంత్రి గులాబీ పూలు ఇచ్చి నచ్చజెప్పారు.

04/18/2016 - 16:29

చెన్నై: కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆమెను ఓడిస్తామంటూ విల్లుపురం హిజ్రాల సంక్షేమ సంఘం హెచ్చరించింది. తమ మనోభావాలను కించపరిచేలా ఖుష్బూ వ్యాఖ్యానించిందని హిజ్రాలు మండిపడుతున్నారు. ఖుష్బూపై తమ సంఘం ప్రతినిధిని పోటీలో నిలబెడతామని వారు ప్రకటించారు.

04/18/2016 - 12:49

గాంధీనగర్: తమకు రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యమనేత హార్దిక్ పటేల్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పటేల్ కులస్ధులు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం గుజరాత్‌లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఆదివారం నుంచి పటేల్ కులస్థులు మళ్లీ ఆందోళన చేయడంతో పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు ఆటంకం ఏర్పడింది. దీంతో 20 కంపెనీల భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు.

04/18/2016 - 07:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దళితులు అధికంగా గల గ్రామాలలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట ఒక పథకాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆదివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. నీరు లేకపోవడం లేదా నీటి సంరక్షణకు అవసరమైన తగిన వౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల దళితులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు.

04/18/2016 - 07:31

కృష్ణానగర్, ఏప్రిల్ 17: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏకంగా ఎన్నికల కమిషన్‌తోనే ఘర్షణకు దిగిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రోజురోజుకీ పరాజయ భయం పెరిగిపోవటంతో తృణమూల్ నాయకత్వం అయోమయంలో పడిపోయిందని ఆదివారం జరిగిన ఎన్నికల సభలో మోదీ పేర్కొన్నారు.

04/18/2016 - 07:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన పది రోజుల ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్’ ప్రచారోద్యమం సమయంలో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన దాదాపు 300 మంది అధికారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలను సందర్శిస్తారు. రక్షణ, హోమ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు కూడా వీరిలో ఉన్నారు.

Pages