జాతీయ వార్తలు

ఓటమి భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణానగర్, ఏప్రిల్ 17: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏకంగా ఎన్నికల కమిషన్‌తోనే ఘర్షణకు దిగిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రోజురోజుకీ పరాజయ భయం పెరిగిపోవటంతో తృణమూల్ నాయకత్వం అయోమయంలో పడిపోయిందని ఆదివారం జరిగిన ఎన్నికల సభలో మోదీ పేర్కొన్నారు. ఏమాత్రం విజయావకాశాలు ఉన్నా ఆమె నేరుగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతోనే తలపడి ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు మారటంతో ఎన్నికల కమిషన్‌నే ‘బెదిరిస్తోంద’ని మోదీ అన్నారు. దీన్నిబట్టి చూస్తే తమ పరాజయాన్ని ఎన్నికలకు ముందే మమతా బెనర్జీ అంగీకరించినట్లయిందన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై మమతా బెనర్జీకి ఈసీ నోటీసు ఇవ్వటం, దానిని ఆమె ధిక్కరించటాన్ని ప్రస్తావించిన మోదీ ‘ఎన్నికలు వస్తాయి, పోతాయి.. కానీ రాజ్యాంగ వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి. ఎన్నికల కమిషన్ స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. ప్రపంచ వ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. అలాంటి వ్యవస్థపైనే బురద జల్లడం సమంజసం కాదు’ అని మమతకు స్పష్టం చేశారు. ఓ క్రీడలో క్రీడాకారులందరూ అంపైర్ల నిర్ణయాన్ని శిరసావహించినట్లుగానే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గంలోనే ముందుకు వెళ్లాలన్నారు. కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దాన్ని తు.చ. తప్పక పాటించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలది అని మోదీ ఉద్ఘాటించారు. ఎన్నికల కమిషన్ నోటీసు ఇచ్చిన తరువాత దానిపై చర్చించాల్సింది పోయి, కమిషన్‌ను కలుసుకుని తన వాదనను వినిపించాల్సింది పోయి, మమత ధిక్కార స్వరాన్ని వినిపించారని ‘వచ్చేనెల 19న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చూస్తా..’ అంటూ హెచ్చరించటం ఎంతమాత్రం ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేది కాదన్నారు. ఈసీ నిర్ణయానికి విలువ ఇవ్వనప్పుడు అసలు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల తన వైఖరి ఏమిటో చెప్పాల్సిన బాధ్యత మమతపై ఉందన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గంలో ఆదివారం బిజెపి నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో చైతన్య మహాప్రభు విగ్రహాన్ని అందుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ