S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/19/2016 - 05:44

ముంబయి, ఏప్రిల్ 18: బాలీవుడ్ పాతతరం హీరో దిలీప్ కుమార్ ఆరోగ్యం కుదుటపడుతోంది. న్యూమోనియాతో గత వారం ముంబయి లీలావతి ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి సోమవారం ఎంతో మెరుగుపడిందని లీలావతి ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ జలీల్ పార్కర్ వెల్లడించారు. దిలీప్‌కుమార్ (93) కుటుంబ సభ్యుల అనుమతితో మరిన్ని పరీక్షలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రెండు మూడు రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని జలీల్ చెప్పారు.

04/19/2016 - 05:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ప్రభుత్వ విధానాలు ఎంత ఘనంగా ఉన్నప్పటికీ వాటిని సరిగా ఆచరణలో పెట్టకపోతే దేశానికి ఒరిగేదేమీ ఉండబోదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. వేగవంతంగా ముందుకు సాగుతున్న ఆధునిక ప్రపంచంలో ప్రభుత్వాలు సరైన విధానాలను రూపొందించుకుని వాటిని సక్రమంగా అమలులో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

04/19/2016 - 05:38

నైనితాల్. ఏప్రిల్ 18: ఉత్తరాఖండ్‌లో తొమ్మిదిమంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తి ప్రదర్శించటం, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం అస్వభావికమని అనిపించటం లేదా అని ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘9మంది ఎమ్మెల్యేలను బహిష్కరించిన కారణంగా మార్చి 28న (ముఖ్యమంత్రి హరీశ్ రావత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసిన రోజు) ఏం జరుగుతోందని కేంద్రం ముందే ఊహించింది..

04/19/2016 - 05:37

అహ్మదాబాద్, ఏప్రిల్ 18: ముంబయి- అహ్మదాబాద్ మధ్య నడపాలని ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కావాలంటే రోజుకు 88వేల నుంచి ఒక లక్షా 18వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లాల్సి ఉంటుందని లేదా రోజుకు వంద ట్రిప్పుల చొప్పున నడవాల్సి ఉంటుందని అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం-ఎ) రూపొందించిన ఒక నివేదిక పేర్కొంది.

04/19/2016 - 05:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: భారత్ రూపొందిస్తున్న తేలికపాటి యుద్ధ విమానాలపై శ్రీలంక, ఈజిప్టు దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో తేజాస్ విమానాలు తయారు చేస్తోంది. 24 ఫ్రెంచ్ రఫాలే యుద్ధ విమానాలకోసం ఈజిప్టు గత ఏడాది ఓ ఒప్పందం చేసుకుంది. ఈ రెండు దేశాలు ప్రస్తుతం దేశీయంగా రూపొందిస్తున్న తేజాస్‌పై మక్కువ చూపుతున్నాయి.

04/19/2016 - 05:32

లక్నో, ఏప్రిల్ 18: తమ వివాహ చట్టాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేయడంతో మరోసారి ‘ట్రిపుల్ తలాక్’ వ్యవహారం పెను వివాదాన్ని సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు సార్లు తలాక్ చెబితే ముస్లిం వివాహ బంధం రద్దయ్యే విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ ఉత్తరాఖండ్‌కు చెందిన షాయరాబానో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

04/19/2016 - 05:31

శ్రీనగర్, ఏప్రిల్ 18: విద్యార్థులు చదువుకోకుండా డిగ్రీలు ప్రదానం చేస్తూ పోతే భారత దేశం మొద్దుల భారతంగా మారుతుందని జమ్ముకాశ్మీర్ హైకోర్టు సోమవారం అభిప్రాయపడింది. ఇలాంటి చర్యల వల్ల మన దేశ విద్యావ్యస్థకు తీరని విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ‘ఒక్కసారి ఊహించండి.. ఎలాంటి చదువు చదవకుండా ప్రజలకు డిగ్రీలను ఇస్తూ పోతే భారత దేశం మొద్దుబుర్రలతో నిండిపోతుంది.

04/19/2016 - 05:30

సూరత్, ఏప్రిల్ 18: పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ కులస్థులు గుజరాత్‌లో చేసిన ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్న ఒక యువకుడు ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెహ్సానాలో పటేల్ కోటా నాయకులపై పోలీసు చర్య విషయం తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయిన భవిన్ ఖుంట్ (27) అనే యువకుడు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నాయకులు తెలిపారు.

04/19/2016 - 02:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఇపిఎఫ్ ఖాతా సభ్యులు ఇక మీదట సొంత ఇంటి కొనుగోలు, టీబీ, క్యాన్సర్, గుండె శస్తచ్రికిత్సలు అలాగే మరికొన్ని అవసరాల కోసం తమ ఖాతాలోని మొత్తం డబ్బును తీసుకునేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వీలు కల్పించారు. ఈ మేరకు ఇపిఎఫ్ సోమవారం తగు ఆదేశాలు జారీ చేసింది.

04/19/2016 - 01:13

శ్రీనగర్, ఏప్రిల్ 18:దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రీనగర్ నిట్ విద్యార్థుల ఘర్షణల వేడి తగ్గక ముందే కాశ్మీర్‌లోని మరో వర్శిటీలో స్థానికులు, స్థానికేతర విద్యార్థుల మధ్య వివాదం రాజుకుంటోంది.

Pages