జాతీయ వార్తలు

వంద ట్రిప్పులు కొడితేనే గిట్టుబాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఏప్రిల్ 18: ముంబయి- అహ్మదాబాద్ మధ్య నడపాలని ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కావాలంటే రోజుకు 88వేల నుంచి ఒక లక్షా 18వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లాల్సి ఉంటుందని లేదా రోజుకు వంద ట్రిప్పుల చొప్పున నడవాల్సి ఉంటుందని అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం-ఎ) రూపొందించిన ఒక నివేదిక పేర్కొంది. ‘డెడికేటెడ్ హైస్పీడ్ రైల్వే (హెచ్‌ఎస్‌ఆర్) నెట్‌వర్క్స్ ఇన్ ఇండియా: ఇష్యూస్ ఇన్ డెవలప్‌మెంట్’ అనే శీర్షికతో రూపొందించిన ఈ నివేదికలో ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టును అధ్యయనం చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం నిధులను అంటే రూ.97,636 కోట్లను సమకూర్చడానికి జపాన్ ముందుకొచ్చింది. రైలు సర్వీసు ప్రారంభమైన 16వ సంవత్సరం నుంచి 50 ఏళ్ల పాటు 0.1 శాతం వడ్డీతో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 20 శాతం నిధులను అంటే రూ. 20వేల కోట్లను కేంద్రం సగటు వడ్డీ రేటు 8శాతంపై సమకూరుస్తుంది. ఈ రైలు 534 కిలోమీటర్లు నడుస్తుంది. జపాన్ తాను ఇచ్చే రుణంపై 15 ఏళ్లపాటు మారటోరియం ప్రకటించడంతో 16వ సంవత్సరం నుంచి రుణం తిరిగి చెల్లింపు భారం మొదలవుతుంది. అయితే ఈ సర్వీసు ప్రారంభమైన 15 ఏళ్ల తరువాత ఒక మనిషిని 300 కిలో మీటర్ల దూరం తీసికెళ్లడానికి టికెట్ ధర రూ. 1500గా నిర్ణయిస్తే, అది రోజుకు 88వేల నుంచి ఒక లక్షా 18వేల మంది ప్రయాణికులను మోసుకెళ్లితేనే, తీసుకున్న రుణాన్ని వడ్డీతోపాటు సకాలంలో చెల్లించడం సాధ్యం అవుతుందని ఐఐఎం-ఎ నివేదిక విశే్లషించింది. 15ఏళ్ల తరువాత ఈ రైలు సర్వీసు నిర్వహణ వ్యయం ఎంతుంటుందో తెలియదు. అయితే ఆదాయంలో 20 శాతం ఉంటుందనే అంచనాతో ఒక విశే్లషణను, 40 శాతం ఉంటుందనే అంచనాతో మరో విశే్లషణను చేశారు. నిర్వహణ వ్యయంపోగా మిగతా రాబడి నుంచి అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక రైలు 800 మందిని తీసుకెళ్లగలుగుతుంది. రోజుకు 88వేల మందిని తీసుకెళ్లాలంటే మొత్తం వంద ట్రిప్పులు నడవాల్సి ఉంటుంది. అంటే ఒక మార్గంలో 50 ట్రిప్పులు నడవాలి. అంటే ఒక మార్గంలో ప్రతి గంటకు మూడు రైళ్లు నడవవలసి ఉంటుందని, అప్పుడే ఆర్థికంగా సర్వీసును నడపటం సాధ్యం అవుతుందని ఈ నివేదిక విశే్లషించింది.