జాతీయ వార్తలు

వడ్డీ సహా పిఎఫ్ సొమ్ము తీసుకోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఇపిఎఫ్ ఖాతా సభ్యులు ఇక మీదట సొంత ఇంటి కొనుగోలు, టీబీ, క్యాన్సర్, గుండె శస్తచ్రికిత్సలు అలాగే మరికొన్ని అవసరాల కోసం తమ ఖాతాలోని మొత్తం డబ్బును తీసుకునేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వీలు కల్పించారు. ఈ మేరకు ఇపిఎఫ్ సోమవారం తగు ఆదేశాలు జారీ చేసింది. వివిధ కార్మిక సంఘాల నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు ఇపిఎఫ్ నిధి నియమ,నిబంధనలను ఈ మేరకు సవరించినట్టు దత్తాత్రేయ తెలిపారు. ఇంటి కొనుగోలు, తనకు లేదా తన కుటుంబ సభ్యులకు టీబీ, క్యాన్సర్, గుండె ఆపరేషన్లకే కాకుండా పిల్లల పెళ్లిల్లు, పిల్లలు వైద్య, డెంటల్, ఇంజనీరింగ్ విద్యనభ్యసించేందుకు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లేదా వాటికి సంబంధించిన సంస్థల ఉద్యోగాల్లో చేరినా సదరు సభ్యుడు తన ఇపిఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చునని దత్తాత్రేయ ఓ ప్రకటనలో వివరించారు. ఈ సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రకటించారు.