జాతీయ వార్తలు

‘తలాక్’జోలికి రావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 18: తమ వివాహ చట్టాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేయడంతో మరోసారి ‘ట్రిపుల్ తలాక్’ వ్యవహారం పెను వివాదాన్ని సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు సార్లు తలాక్ చెబితే ముస్లిం వివాహ బంధం రద్దయ్యే విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ ఉత్తరాఖండ్‌కు చెందిన షాయరాబానో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడే ఉద్దేశంతో ఈ కేసుపై తనంతటతానుగానే విచారణ ప్రక్రియను చేపట్టాలని సుప్రీం కోర్టు నిర్ణయించడం, దాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించడంతో పరిస్థితి ముదురుపాకాన పడింది. తమ వ్యవహారంలో కేంద్రం లేదా ఇతర ఏ వ్యవస్థ జోక్యం చేసుకున్నా తీవ్రంగా తిప్పికొడతామని బోర్డు తెగేసి చెప్పింది. అలాగే సుప్రీం కోర్టులో కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, తమ వాదనలు బలంగా వినిపించాలని నిర్ణయించింది. దీనితో 1980దశకంలోని షాబానో కేసు తరహాలోనే షాయరా బానో కేసు కూడా సంఘర్షణలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.