జాతీయ వార్తలు

కోలుకుంటున్న దిలీప్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 18: బాలీవుడ్ పాతతరం హీరో దిలీప్ కుమార్ ఆరోగ్యం కుదుటపడుతోంది. న్యూమోనియాతో గత వారం ముంబయి లీలావతి ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి సోమవారం ఎంతో మెరుగుపడిందని లీలావతి ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ జలీల్ పార్కర్ వెల్లడించారు. దిలీప్‌కుమార్ (93) కుటుంబ సభ్యుల అనుమతితో మరిన్ని పరీక్షలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రెండు మూడు రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని జలీల్ చెప్పారు. అభిమానుల ప్రార్థనల వల్లే ఆయన కోలుకున్నారని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకోవడంతోపాటు దిలీప్‌కుమార్ నవ్వుతున్న ఓ ఫొటోను పోస్టుచేశారు. దిలీప్ తీవ్రమైన జ్వరం, శ్వాసకు సంబంధించిన సమస్యతో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన భార్య సైరాబాను ఇంతకుముందే ఓ ప్రకటనలో తెలిపారు.