జాతీయ వార్తలు

మాకూ తేజాస్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: భారత్ రూపొందిస్తున్న తేలికపాటి యుద్ధ విమానాలపై శ్రీలంక, ఈజిప్టు దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో తేజాస్ విమానాలు తయారు చేస్తోంది. 24 ఫ్రెంచ్ రఫాలే యుద్ధ విమానాలకోసం ఈజిప్టు గత ఏడాది ఓ ఒప్పందం చేసుకుంది. ఈ రెండు దేశాలు ప్రస్తుతం దేశీయంగా రూపొందిస్తున్న తేజాస్‌పై మక్కువ చూపుతున్నాయి. హెచ్‌ఎఎల్ ఉత్పత్తి చేస్తున్న విమానాలు ముందు వైమానిక దళంలో ప్రవేశపెడతారు. శ్రీలంక, ఈజిప్టులతోపాటు అనేక దేశాలు భారత తేజ విమానాలపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ముందు దేశీయ అవసరాలు తీర్చిన తరువాత వాటి సంగతి పరిశీలిస్తామని హెచ్‌ఎఎల్ చైర్మన్ సువర్ణరాజు వెల్లడించారు.