జాతీయ వార్తలు

పటేళ్ల ఆందోళన మరింత తీవ్రం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, ఏప్రిల్ 18: పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ కులస్థులు గుజరాత్‌లో చేసిన ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్న ఒక యువకుడు ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెహ్సానాలో పటేల్ కోటా నాయకులపై పోలీసు చర్య విషయం తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయిన భవిన్ ఖుంట్ (27) అనే యువకుడు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నాయకులు తెలిపారు. అయితే ఆ యువకుడి ఆత్మహత్యకు కారణమేంటనే విషయం విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. సూరత్‌లో పాస్ నేతృత్వంలో సాగిన పటేళ్ల ఆందోళనలో చురుకుగా పాల్గొన్న భవిన్ ఇక్కడి పునాగామ్ ప్రాంతంలోని తన నివాసంలో ఆదివారం సాయంత్రం విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పాస్ సూరత్ కన్వీనర్ నిఖిల్ సవాని చెప్పారు. మెహ్సానాలో ‘జైల్ భరో’ ఆందోళన నిర్వహించడానికి సమీకృతులయిన పటేల్ కులస్థులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు, హింస గురించి తెలుసుకున్న భవిన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని సవాని చెప్పారు. సాయంత్రం ఏడు గంటలకు విషం తీసుకున్న భవిన్‌ను వరచ్చా ప్రాంతంలో గల ఆసుపత్రికి తరలించగా, అర్ధరాత్రి సమయంలో అతను మృతి చెందినట్లు సవాని తెలిపారు. భవిన్ అంత్యక్రియలను సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు. భవిన్ మృతిపై కేసు నమోదు చేసిన పునాగామ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.