జాతీయ వార్తలు

విధానాల రూపకల్పన కన్నా వాటి సక్రమ అమలే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ప్రభుత్వ విధానాలు ఎంత ఘనంగా ఉన్నప్పటికీ వాటిని సరిగా ఆచరణలో పెట్టకపోతే దేశానికి ఒరిగేదేమీ ఉండబోదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. వేగవంతంగా ముందుకు సాగుతున్న ఆధునిక ప్రపంచంలో ప్రభుత్వాలు సరైన విధానాలను రూపొందించుకుని వాటిని సక్రమంగా అమలులో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు వేగవంతంగా మారుతుండటంతో అంతే స్థాయిలో సవాళ్లు కూడా ఉద్భవిస్తున్నాయి. కనుక ప్రపంచ స్వభావానికి అనుగుణంగా ప్రభుత్వాలు మెరుగైన విధానాలను రూపొందించుకుని వాటిని సక్రమంగా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది’ అని ప్రణబ్ సోమవారం ఇక్కడ తనను కలసిన మొహాలీ ఐఎఎస్‌బి (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) విద్యార్థులతో అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు కొద్ది సంవత్సరాల్లో మారిపోతాయని, కనుక నిపుణులతో పాటు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తమ విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన ఉద్బోధించారు.

చిత్రం రాష్టప్రతి భవన్‌లో సోమవారం మొహాలీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
విద్యార్థులతో ముచ్చటిస్తున్న రాష్టప్రతి ప్రణబ్