జాతీయ వార్తలు

ఇదేమన్నా బాగుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనితాల్. ఏప్రిల్ 18: ఉత్తరాఖండ్‌లో తొమ్మిదిమంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తి ప్రదర్శించటం, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం అస్వభావికమని అనిపించటం లేదా అని ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘9మంది ఎమ్మెల్యేలను బహిష్కరించిన కారణంగా మార్చి 28న (ముఖ్యమంత్రి హరీశ్ రావత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసిన రోజు) ఏం జరుగుతోందని కేంద్రం ముందే ఊహించింది.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేరే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న చోట కేంద్రం కలుగజేసుకోవటం అస్వభావికమని అనిపించటం లేదా’’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే ఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిస్త్‌లు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని ప్రశ్నించారు. విశ్వాస పరీక్ష ఎదుర్కోవటానికి సరిగ్గా రెండు రోజుల ముందు అంటే మార్చి 26న రాష్టప్రతి పాలన విధించటాన్ని సవాలుచేస్తూ హరీశ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేసింది. ద్రవ్యబిల్లును ప్రవేశపెట్టినప్పుడు డివిజన్ కోరటం అసెంబ్లీలో జరిగిన ఒక ఘటన.. కేవలం ఈ ఘటనను కారణంగా చూపించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని.. అదీ అయిదో సంవత్సరంలో బర్తరఫ్ చేయటం ప్రజాస్వామ్య వేళ్లను నరికేయటంలా అనిపించటం లేదా’’ అని ప్రశ్నించింది. అయితే అటార్నీ జనరల్ రోహత్గీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. ద్రవ్యబిల్లును ప్రవేశపెట్టినప్పుడు 35మంది ఎమ్మెల్యేలను స్పీకర్ ఓటింగ్‌కు అనుమతించకపోవటం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయటమేనని ఆయన వాదించారు. మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్, స్పీకర్ కుమ్మక్కయ్యారన్నారు. ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరగకపోవటం వల్ల ప్రభుత్వం పడిపోయిందని ఆయన అన్నారు. అయితే హైకోర్టు దీంతో సంతృప్తి చెందలేదు. ‘రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ పర్యవేక్షించాల్సి ఉంది. గవర్నర్ కేంద్ర ఏజెంట్ కాదు. అతను స్వతంత్రుడు. ప్రభుత్వాన్ని విశ్వాస పరీక్షను ఎదుర్కోమని ఆదేశించారు. పరీక్ష జరిగేంత వరకూ కేంద్రం తటస్థ వైఖరిని అవలంబించాల్సి ఉండింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.