జాతీయ వార్తలు

జంటహత్యల కేసులో ఐటి ఉద్యోగికి మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: ప్రియురాలి కుమార్తెను, ఆమె అత్తను హత్యచేసినందుకు ఓ ఐటి ఉద్యోగికి స్థానిక జిల్లా కోర్టు సోమవారం ఉరిశిక్షను విధించింది. ఈ హత్యలకు సహకరించిన ప్రియురాలికి జీవితఖైదు విధించారు. ఇక్కడి టెక్‌పార్క్‌లో నినో మాథ్యూ, అనుశాంతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తూ ప్రేమలో పడ్డారు. తన కుటుంబ సభ్యులను చంపాలని అనుశాంతి పథకం వేసి ప్రియుడి సహకారాన్ని కోరింది. దీంతో నినో మాథ్యూ ప్రియురాలి మూడేళ్ల కుమార్తె స్వస్తిక, అత్త ఓమనలను హత్య చేశాడు. ప్రియురాలి ఒత్తిడితో ఆమె భర్త లిజేష్‌ను కూడా చంపేందుకు మాథ్యూ ప్రయత్నం చేశాడు. అయితే లిజేష్ కేకలు వేయడంతో స్థానికులు పరుగుపరుగున వచ్చి మాథ్యూను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇది అరుదైన కేసు అని, కిరాతక సంఘటన అని, సొంత కుమార్తెను, అత్తను హత్యచేయించిన అనుశాంతి మాతృత్వానికే మాయనిమచ్చ తెచ్చిందని జిల్లా జడ్జి వ్యాఖ్యానించారు.