జాతీయ వార్తలు

‘గ్రామోదయ్’ ప్రచారోద్యమంలో 300 మంది అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన పది రోజుల ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్’ ప్రచారోద్యమం సమయంలో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన దాదాపు 300 మంది అధికారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలను సందర్శిస్తారు. రక్షణ, హోమ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు కూడా వీరిలో ఉన్నారు. ఏప్రిల్ 14 నుంచి 24 వరకు జరగనున్న ప్రచార కార్యక్రమం సందర్భంగా గ్రామ పంచాయతీలను సందర్శించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు డిప్యూటీ సెక్రటరీలు, డైరక్టర్ స్థాయి అధికారులను నామినేట్ చేశాయి. ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్’ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, ప్రధాన మంత్రి కార్యాలయం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ఉత్తర్వులో తెలిపింది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్‌కు చెందిన ఏ అధికారిని ఈ కార్యక్రమంకోసం నామినేట్ చేయకపోవడం గమనార్హం.
గ్రామాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 14న ఈ పథకాన్ని ప్రారంభించడం తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలనుంచి నామినేట్ అయిన అధికారులు వివిధ రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలను సందర్శిస్తారు. నామినేట్ అయిన అధికారుల్లో రక్షణ శాఖకు చెందిన వారు 32 మంది, ఆర్థిక శాఖనుంచి 21 మంది, హోం మంత్రిత్వ శాఖకు చెందినవారు 15 మంది ఉన్నారని ఆ ఉత్తర్వు తెలిపింది. మొత్తం 900 మంది డిప్యూటీ సెక్రటరీలు, డైరెక్టర్లలో 300 మందిని ఈ కార్యక్రమంకోసం నామినేట్ చేయడం జరిగిందని, మరింత మంది ఉద్యోగులను కూడా నామినేట్ చేసే అవకాశముందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రచారం ప్రారంభించడానికి రెండు రోజుల ముందు ఏర్పాటు చేసిన పునశ్చరణ కార్యక్రమానికి చాలా తక్కువ మంది అధికారులు హాజరయ్యారనే విషయాన్ని తెలియజేయడానికి ఈ లేఖను జారీ చేశారు. నామినేట్ అయిన 300 మంది అధికారుల్లో 170 మంది మాత్రమే ఈ పునశ్చరణ తరగతులకు హాజరయ్యారు.