S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/15/2016 - 00:32

విజయవాడ, ఏప్రిల్ 14: ముంబయిలో జరుగుతున్న మారిటైం సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ నుంచి ముంబైలో జరుగుతున్న సదస్సుకు వెళ్లారు. కాకినాడ నుంచి పుదుచ్చేరికి నేషనల్ వాటర్‌వే అభివృద్ధి చేయడానికి ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

04/15/2016 - 00:31

టంగుటూరు, ఏప్రిల్ 14: పుణ్య క్షేత్రాల సందర్శన చేస్తున్న భక్త బృందం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద గురువారం జరిగింది.

04/14/2016 - 18:03

భోపాల్: ఇతరుల ఇళ్లలో పాచిపనులు చేసిన మహిళ కొడుకు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుణ్యమేనని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంతో అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం వౌలో గురువారం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, తన తల్లి ఇతరుల ఇళ్లలో అంట్లుతోమి తనను చదివించిందని గుర్తుచేసుకున్నారు.

04/14/2016 - 18:02

దిల్లీ: రాజకీయాల్లోకి రానని తాను ఎప్పుడూ చెప్పలేదని, ఆత్మసాక్షి చెబితే రాజకీయాల్లోకి వస్తానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా గురువారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ దేశాన్ని విడిచిపెట్టే అవసరం రాదని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లనైనా తట్టుకునే శక్తి తనకు ఉందన్నారు. ‘సంతృప్తికరంగా బతకడానికి నా తండ్రి ఎంతో సంపదను, సామర్ధ్యాలను ఇచ్చారు..

04/14/2016 - 16:27

శ్రీనగర్: హంద్వారాలో పోలీసు కాల్పులకు నిరసనగా కాశ్మీర్‌లోయలో రెండోరోజు గురువారం కూడా బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలను మూసివేశారు. హంద్వారాలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించినందుకు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి.

04/14/2016 - 16:27

ముంబయి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు రాజు గురువారం ఇక్కడ బౌద్ధమతం స్వీకరించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ సమక్షంలో ఇక్కడి దాదర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వారు మతం మారారు. హిందూ మతంలో కులవివక్ష ఉన్నందునే తాము బౌద్ధం స్వీకరించామని రాధిక, రాజు తెలిపారు.

04/14/2016 - 16:25

నాగ్‌పూర్: జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ప్రయాణిస్తున్న కారుపై నాగ్‌పూర్‌లో గురువారం కొందరు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. బజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలే కన్నయ్యపై దాడికి యత్నించారని పోలీసులు చెబుతున్నారు.

04/14/2016 - 16:24

కొల్లం: కొల్లం జిల్లా పుట్టింగళ్‌లో బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గురువారం మరో వ్యక్తి మరణించడంతో మృతుల సంఖ్య 144కు చేరింది. తీవ్ర గాయాలతో సుమారు 300 మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు కేరళ సిఎం ఊమెన్ చాందీ ప్రకటించారు.

04/14/2016 - 16:24

ముంబయి: కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం వద్ద బుధవారం సాయంత్రం తనపై హత్యాయత్నం జరిగిందని ఆలయాల్లో మహిళల ప్రవేశానికి పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ తెలిపారు. కొంతమంది ఆందోళనకారులతో మహాలక్ష్మి ఆలయం వద్దకు తాను వెళ్లగా కొందరు తనపై దాడి చేసి గాయపరిచారని ఆమె చెప్పారు. మహిళలపై కొందరు ఆగంతకులు దాడి చేసి దుస్తులు చించివేశారన్నారు.

04/14/2016 - 14:30

శ్రీనగర్: అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా భద్రతా యంత్రాంగం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. హంద్వారాలో ఒక బాలికను జవాన్ అత్యాచారం చేసినట్లు వచ్చిన ఆరోపణల నడుమ రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Pages