జాతీయ వార్తలు

త్య్రయంబకేశ్వరం గుడిలో మహిళలకు షరతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్: మహారాష్టల్రోని త్య్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలని దేవస్థానం ట్రస్టుబోర్డు నిర్ణయించినప్పటికీ కొన్ని షరతులను విధించడం తగదని మహిళా హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గర్భగుడిలోకి ఉదయం 6 నుంచి 7 గంటల వరకూ గంటసేపు మాత్రమే మహిళలు రావాలని, తడిగా ఉన్న కాటన్ లేదా సిల్కు దుస్తులనే ధరించాలని ట్రస్టుబోర్డు కొన్ని షరతులు విధించింది. ఆలయాల్లోకి స్ర్తిలను అనుమతించాలని సాక్షాత్తూ సుప్రీం కోర్టు తాజాగా ఆదేశించాక మళ్లీ ఈ షరతులేమిటని ఆందోళనకారులు నిలదీస్తున్నారు. కాగా, శుక్రవారం ఉదయం ఆలయ అధికారులు అనుమతించిన గంట వ్యవధిలోనే పలువురు మహిళలు గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు.