జాతీయ వార్తలు

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: రెండు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినియోగదారులకు శుక్రవారం స్వల్ప ఊరటనందించింది. పెట్రోలుపై లీటరుకు 74 పైసలు, డీజిల్‌పై రూ.1.30పైసల చొప్పున తగ్గించింది. మారిన ఈ రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.61.13 పైసలకు తగ్గింది. అలాగే డీజిల్ రేటు కూడా రూ.49.31పైసల నుంచి 48.01 పైసలకు తగ్గింది. గత రెండు నెలల కాలం లో పెట్రోలు ధర లీటరుకు రూ.5.25 పైసల మేర పెరిగింది. డీజిల్ రేటు వరుసగా నాలుగుసార్లు పెరుగుతూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను బట్టి దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పులు వస్తున్నాయి.