జాతీయ వార్తలు

వేరే పార్టీకి ఓటు వేసిందని భార్యకు విడాకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: గ్రామపెద్దల నిర్ణయాన్ని కాదని ఎన్నికల్లో వేరే పార్టీకి ఓటు వేసినందుకు ఆగ్రహించి భార్యకు విడాకులిచ్చేశాడు ఓ భర్త. అస్సాం అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో సోనిట్‌పూర్ జిల్లా డోనం అడ్డహతి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని గ్రామపెద్దలు తీర్మానించారు. అయితే, గ్రామపెద్దల తీర్మానానికి విరుద్ధంగా బిల్వారా బేగం బిజెపికి ఓటు వేసింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి గ్రామపెద్దల వరకూ వెళ్లింది. గ్రామంలో తన పరువు పోయిందని బేగం భర్త అయినుద్దీన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వేరే పార్టీకి ఓటు వేసిందని భార్యకు ‘తలాక్’ (విడాకులు) చెప్పేశాడు.