S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/20/2016 - 08:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సోమవారం ఓ వ్యక్తి ఇంకు జల్లాడు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వెలుపలే ఈ ఘటన చోటుచేసుకుంది. జనం వివిధ వ్యాధులతో బాధపడతుంటే పట్టించుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్తారా అంటూ ఆగ్రహంతో అతడు ఈ చర్యలు పాల్పడ్డాడు. మంత్రి కారు ఎక్కుతుండగా బ్రిజేష్ శుక్లా అనే ఢిల్లీ వాసి ఇంకు వేశాడు. సిసోడియా చేతులు, నుదిటపై సిరా పడింది.

09/20/2016 - 08:15

గౌహతి, సెప్టెంబర్ 19: అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో గల ప్రాంతాల నుంచి సోమవారం ప్రజలను ఖాళీ చేయిస్తుండగా తలెత్తిన హింస, తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పోలీసు సిబ్బంది సహా మరో 19 మంది గాయపడ్డారు.

09/20/2016 - 08:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తమిళనాడుకు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకూ రోజుకు మూడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశి శేఖర్ కర్నాటకను ఆదేశించారు. కేంద్ర జలవనరుల శాఖ సారథ్యంలోని కావేరీ పర్యవేక్షక కమిటీ సోమవారం ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ నెల 12న సమావేశమైన కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

09/20/2016 - 08:10

చండీగఢ్, సెప్టెంబర్ 19: పాకిస్తాన్ విషయంలో భారత విధానం పూర్తి గందరగోళంగా తయారవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే పూర్తి బాధ్యుడని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి విషయంలో ఇంటెలిజన్స్ పరంగాను, సైనిక చర్యపరంగాను ఘోర వైఫల్యానికిగాను దమ్ముంటే రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌పై చర్య తీసుకోవాలని సవాలు చేసింది.

09/20/2016 - 08:09

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: యూరి మిలిటెంట్ దాడి నేపథ్యంలో భారత్ నుంచి ఎలాంటి సవాళ్లు తలెత్తినా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సన్నద్ధమవుతోంది. భారత నాయకత్వం తీవ్రస్థాయిలో హెచ్చరిక స్వరాన్ని వినిపించడంతో పాక్ ఆర్మీ చీఫ్ సోమవారం సైనిక కమాండర్లతో సమావేశమయ్యారు. దేశీయ, బాహ్య భద్రతా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిణామాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని వారికి స్పష్టం చేశారు.

09/20/2016 - 08:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: యూరిలోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్‌కు అండగా నిలిచాయి. దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ డిమాండ్ చేశారు. ఫ్రాన్స్, కెనడా, వెనిజులా తదితర దేశాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని ప్రకటించాయి.

09/20/2016 - 07:35

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 19: నూతన పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునర్ధురించాలని డిమాండ్ చేస్తూ ఏపి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ నేతలు ఇంద్రశేఖర్ మిశ్రా, అమర్‌జిత్ కౌర్,రజాక్, తెలంగాణ ఎస్‌టియు నేతలు సదానంద గౌడ్, పర్వతరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

09/20/2016 - 07:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనేలా స్పీకర్‌కి అదేశాలు ఇవ్వాలంటూ గతంలో సుప్రీంకోర్టులో ఎర్రబెల్లి దయాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

09/20/2016 - 07:33

న్యూఢిల్లీ సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని లోతట్టు ప్రాంతాలను ఎత్తును పెంచుతున్నారా అని మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ తరఫు న్యాయవాది అటువంటిది లేదని సమాధానం ఇస్తూ, తమ వాదనల సమయంలో వివరిస్తామని ట్రిబ్యునల్‌కు తెలిపారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి ఎన్జీటి వాయిదా వేసింది.

09/20/2016 - 07:22

బెంగళూరు, సెప్టెంబర్ 19: ఎవరికయినా వంద రూపాయలు ఇచ్చి, ఒక ప్లేట్ మటన్ బిర్యాని తినిపిస్తామంటే 42 బస్సులను దగ్ధం చేస్తారా? దీనికి సమాధానం అవును అని వస్తే, ఈ దహనకాండకు పాల్పడింది ఓ యువతి అని తెలిస్తే ఇంకెంతో ఆశ్చర్యంగా, ఒళ్లు జలదరించేలా ఉంటుంది! కర్ణాటకలో తలెత్తిన హింసాకాండలో భాగంగా ఈ చేదు సంఘటన జరిగింది.

Pages